PM MOdi : నేడు వారణాసిలో మోడీ నామినేషన్‌..చంద్రబాబు, పవన్‌ హాజరు

  • Written By:
  • Publish Date - May 14, 2024 / 10:39 AM IST

Prime Minister Narendra Modi nomination: ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి(Varanasi) లోక్‌సభ స్థానం నుండి ప్రధాని నరేంద్రమోడీ(PM MOdi) నేడు నామినేషన్‌(nomination) దాఖలు చేయనున్నారు. అయితే నామినేషన్‌ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) హాజరుకానున్నారు. చంద్రబాబు మంగళవారం ఉదయం వారణాసి బయలుదేరి వెళ్లారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. మోడీ నామినేషన్ కార్యక్రమం తర్వాత ఎన్డీఏ పక్షాల బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతారు. సాయంత్రం తిరిగి ఆయన విజయవాడకు బయలుదేరతారు. మరోవైపు మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సోమవారం రాత్రే వారణాసి చేరుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నామినేషన్ కంటే ముందు మోడీ దశాశ్వమేధ ఘాట్ సందర్శించనున్నారు. అనంతరం క్రూజ్‌లో నమో ఘాట్ వరకూ ప్రయాణించనున్నారు. ఆ తర్వాత కాలభైరవ ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉంది. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్లో పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు. మోడీ నామినేషన్ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. హాజరయ్యేవారిలో బీజేపీ పాలిత రాష్ట్రాల 12 మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన నేతలు చంద్రబాబు (టీడీపీ), పవన్ కల్యాణ్ (జనసేన), జయంత్ చౌదరి (ఆర్ఎల్డీ), చిరాగ్ పాశ్వాన్ (ఎల్జేపీ), అనుప్రియ (అప్నాదళ్), ఓంప్రకాశ్ రాజ్‌భర్ (సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ) తదితరులున్నారు.

Read Also:Govt OTT : రెండేళ్లు ఫ్రీ ఫ్రీ.. కేంద్ర ప్రభుత్వ ఓటీటీ వస్తోంది ! 

కాగా, మోడీ నామినేషన్‌ కార్య క్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే ఎన్డీయే పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లును స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దగ్గరుండి చూసుకుంటున్నారు.