Site icon HashtagU Telugu

Modi’s Teacher : పాఠాలు చెప్పిన గురువును కలిసి ప్రధాని మోదీ…!!

Modi Teacher

Modi Teacher

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటించారు. నవ్ సారి ప్రాంతంలోని వాద్ నగర్ వెళ్లిన మోదీ…తనకు బాల్యంలో పాఠాలు చెప్పిన తన గురువును కలిసారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. తన గురువు యోగక్షేమాలను ఆరా తీశారు. మోదీని చూడగానే ఆ గురువులో ఆప్యాయత, ఆనందం ఉప్పొంగింది. తన శిష్యుడు…దేశ ప్రధాని అయ్యాడన్న సంతోషం ఆయనలో వెల్లివిరిసింది. మోదీని ఆప్యాయంగా ఆలింగం చేసుకున్నారు. ఆనంద బాష్యాలు రాల్చారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. నెటిజన్లు ఆ ఫొటోను చూసి కామెంట్లు చేస్తున్నారు.