తమకు ఓట్లు కాదు.. ప్రజల హృదయాలు గెలుచుకోవడం ముఖ్యమన్నారు ప్రధాని మోడీ (PM Modi). లోక్‌సభ (Lok Sabha )లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ ఫై విమర్శలు చేస్తూనే..బిజెపి అధికారంలోకి వచ్చాక దేశం ఎంతగా అభివృద్ధి జరిగిందో..బిజెపి ప్రభుత్వంలో ఎలాంటి మంచి జరిగిందో వంటి అంశాల గురించి చెప్పుకొచ్చారు.
తమ ప్రభుత్వంలో మహిళా రిజర్వేషన్ చట్టం తెచ్చాం. అయోధ్యలో అద్భుతమైన ఆలయం నిర్మించాం. స్పేస్ నుంచి ఒలింపిక్స్ వరకు మహిళా శక్తి గురించి తెలియజేసాం… 4 కోట్ల మందికి పక్కా గృహాలు నిర్మించాం. 55 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా రక్షణ కల్పించాం. యువతకు ఉపాధి ఇచ్చాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు మా పాలన లో జరిగాయని..వాటిన్నింటిని ప్రజలు వెయ్యేళ్లు గుర్తుంచుకుంటారు అని మోడీ చెప్పుకొచ్చారు. మాకు ఓట్లు కాదు ముఖ్యంగా..ప్రజల హృదయాలను గెలుచుకోవడం ముఖ్యమని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
కేంద్రంలో మరోసారి తామే అధికారంలోకి వస్తామని ఈ సందర్బంగా మోడీ ధీమా వ్యక్తం చేశారు. ‘2024 ఎన్నికల్లో ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయి. బీజేపీ సొంతంగా 370 స్థానాలు గెలుచుకుంటుంది. వంద రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పడబోతోంది. మేం సాధించిన అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ పార్టీకి మరో వందేళ్లు పడుతుంది’ అని విమర్శించారు. దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నందున మళ్లీ దశాబ్దాల తరబడి విపక్షంలో ఉండాలని భావిస్తున్నారని ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీకి చురకలంటించారు. విపక్షాల కోరికను భగవంతుడు నెరవేరుస్తారని భావిస్తున్నా అని అన్నారు. ఎన్నికల తర్వాత విపక్ష నేతలు ప్రేక్షకుల సీట్లకు పరిమితమవుతారని అన్నారు.
‘ఈడీ దాడులతో విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. దర్యాప్తు సంస్థలపై ఆరోపణలు చేస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో వాటిని రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. కాంగ్రెస్ పాలనలో ఈడీ కేవలం రూ.5 వేల కోట్లే సీజ్ చేసింది. మా హయాంలో ఈడీ రూ.లక్ష కోట్లు సీజ్ చేసింది. విచారణ జరపడం ఈడీ పని’..అవినీతిని అంతం చేసే వరకు విశ్రమించేది లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
Read Also : Salarjung Museum : దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియం మన హైదరాబాద్‌లో