Modi Ka Parivaar : ‘మోదీ కా పరివార్’ – దేశమంతా మోడీ కుటుంబమే అంటున్న నేతలు

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ (Lalu Prasad Yadav)..ప్రధాని మోడీ (PM Modi) ఫై చేసిన వ్యాఖ్యలకు బిజెపి నేతలు కౌంటర్ ఇస్తూ..దేశమంతా మోడీ కుటుంబమే అంటూ ‘మోదీ కా పరివార్’ పేరును వైరల్ చేస్తున్నారు. ఆదివారం బీహార్ పాట్నా వేదికగా రాష్ట్రీయ జనతాదళ్ ఆధ్వర్యంలో జరిగిన ‘జన్ విశ్వాస్ ర్యాలీ’ (‘Jan Vishwas Rally’) కార్యక్రమానికి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, […]

Published By: HashtagU Telugu Desk
Modi

Modi

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ (Lalu Prasad Yadav)..ప్రధాని మోడీ (PM Modi) ఫై చేసిన వ్యాఖ్యలకు బిజెపి నేతలు కౌంటర్ ఇస్తూ..దేశమంతా మోడీ కుటుంబమే అంటూ ‘మోదీ కా పరివార్’ పేరును వైరల్ చేస్తున్నారు. ఆదివారం బీహార్ పాట్నా వేదికగా రాష్ట్రీయ జనతాదళ్ ఆధ్వర్యంలో జరిగిన ‘జన్ విశ్వాస్ ర్యాలీ’ (‘Jan Vishwas Rally’) కార్యక్రమానికి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. ప్రధాని మోడీ..అసలు హిందువు కాదని లాలూ పేర్కొన్నారు. ఆయన తల్లి మరణిస్తే గుండు కొట్టించుకోలేదని లాలూ అన్నారు. ప్రధాని మోడీ కుటుంబ రాజకీయాలపై దాడికి పాల్పడుతున్నారని, అతనికి కుటుంబమే లేదని ఎద్దేవా చేశారు. తల్లి మరణిస్తే హిందువులెవరైనా గుండు చేయించుకుంటారని, కానీ ప్రధాని అలా చేయలేదని, ఎందుకు గుండు చేయించుకోలేదు..? అని లాలూ విమర్శలు గుప్పించారు. కుటుంబ రాజకీయాలను ప్రధాని టార్గెట్ చేస్తున్నారని, అతనికి ఎందుకు పిల్లలు లేరు, ఎందుకు ఫ్యామిలీ లేదు, ఎందుకంటే అతను హిందువు కాదు అంటూ ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

లాలూ ఆరోపణలకు దీటుగా బిజెపి నేతలు సోషల్ మీడియా లో తమ పేరు తర్వాత ‘మోదీ కా పరివార్’ (Modi Ka Parivaar ) అంటూ జత చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తదితర బీజేపీ నాయకులు తమ ట్విట్టర్ బయోలో తమ పేరు తర్వాత ‘మోదీ కా పరివార్’ అంటూ జత చేసుకున్నారు. ‘”నేను మోదీ కుటుంబం” మా కుటుంబం వసుదైక కుటుంబం. మా లక్ష్యం విశ్వ యవనికపై మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడేలా చేయడం’ అని బండి సంజయ్ తన బయోలో మార్పు చేసిన అనంతరం ట్వీట్ చేశారు.

అలాగే లాలూ వ్యాఖ్యలపై దీటుగా ఆదిలాబాద్ సభ (Adilabad Sabha)లో ప్రధాని మోడీ పరోక్షంగా స్పందించారు. 140 కోట్ల మంది భారతీయులు నా పరివారం… దేశంలోని నా అక్కాచెల్లెల్లు, అన్నదమ్ములు, తల్లులు, బిడ్డలు నా కుటుంబం… రైతులు, పేదలు, పిల్లలు… నా కుటుంబం అని ప్రధాని మోడీ కౌంటర్ ఇచ్చారు. నా కుటుంబం కారణంగా నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఇప్పుడు దేశం మొత్తం మోడీ కుటుంబమని చెప్పుకుంటుందని , దేశం ఇప్పుడు ఒకే స్వ‌రంతో .. మై హూ ప‌రివార్ అని , నేనే మోడీ కుటుంబం అని అంటోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. మై హూ మోదీ ప‌రివార్ అని స‌భ‌కు వ‌చ్చిన ప్ర‌జ‌ల‌తో మోడీ ప‌లికించారు.

Read Also : Babu Mohan : వరంగల్ లోక్‌సభ బరిలో బాబు మోహన్.. ప్రజాశాంతి పార్టీలో చేరిక

  Last Updated: 04 Mar 2024, 05:25 PM IST