Kejriwal : తప్పుడు కేసులో కేజ్రీవాల్‌ను మోడీ జైల్లో పెట్టించారు: సునీతా కేజ్రీవాల్‌

ఎన్నికల నేపథ్యంలో హర్యానాలోని సోహ్నాలో ఈరోజు జరిగిన ర్యాలీలో సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ..అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో చేసిన మంచి పనులకి జైలు పాలయ్యారని పేర్కొన్నారు.

Published By: HashtagU Telugu Desk
Modi jailed Kejriwal in a false case: Sunita Kejriwal

Modi jailed Kejriwal in a false case: Sunita Kejriwal

Sunita Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ప్రభుత్వ స్కూళ్ల పరిస్దితి మెరుగుపరిచి, మొహల్లా క్లినిక్లను ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్ను అందించిన ఘనత ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్దేనని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఎన్నికల సందర్భంగా హర్యానాలోని సోహ్నలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో సునీతా కేజ్రీవాల్ మాట్లాడారు.

We’re now on WhatsApp. Click to Join.

దేశంలో ఈ తరహా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేజ్రీవాల్ ఒక్కరే చేయగలిగారని, ప్రధాని మోడీ ఇలాంటి అభివృద్ధి పనులను చేపట్టలేదని ఆమె పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన అభివృద్ధి పనులను నిలిపివేసేందుకు ప్రధాని మోడీ కుట్రపూరితంగా తప్పుడు కేసులో కేజ్రీవాల్ను జైల్లో పెట్టించారని ఆరోపించారు. హరియాణ బిడ్డ కేజ్రీవాల్ ఎన్నటికీ ప్రధాని మోడీ ముందు తలవంచబోరని ఆమె స్పష్టం చేశారు. 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయిన సమయంలో గుజరాత్ ప్రజలు ఆయనకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ఇక దేశంలోనే హరియాణను గర్వకారణంగా నిలిపిన అరవింద్ కేజ్రీవాల్‌ను రానున్న హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆదరిస్తారని, బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయరని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

కాగా, గత వారం, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత కూటమి ర్యాలీలో మాట్లాడుతూ.. సునీతా కేజ్రీవాల్ తీహార్ జైలులో తన భర్త ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిపై ఫేక్ కేసులు పెట్టి అతని ఆరోగ్యంతో ఆడుకోవడం ద్వారా “పరువు” తీసేందుకు ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. “ఢిల్లీ ప్రజల పనిని ముఖ్యమంత్రి ఏ విధంగానూ ఆపివేయడం లేదు కాబట్టి ఢిల్లీ పనిని ఆపడమే వారి ఏకైక ఉద్దేశ్యం. పోరాటం ద్వారా ఢిల్లీ ప్రజల కోసం అన్ని పనులను పూర్తి చేస్తాడు. ఢిల్లీ ప్రజలు బీజేపీకి ఏడుగురు ఎంపీలను ఇచ్చారు. ఈ బీజేపీ ఎంపీలు ఢిల్లీ కోసం ఏం పని చేశారని మీరు వారిని అడగండి. ఈ వ్యక్తులకు ఒకే రాజకీయం ఉంది..ద్వేషం మరియు పనిని ఆపడం అని సునీతా కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

Read Also: Wayanad Landslides : కేరళ వరద బాధితులకు మెగా హీరోల సాయం

  Last Updated: 04 Aug 2024, 05:43 PM IST