PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన మోడీ

  • Written By:
  • Updated On - December 18, 2023 / 05:20 PM IST

PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. వారణాసిలోని స్వరవేద్‌ మహామందిరంలో ధ్యానమందిరం ఏర్పాటైంది. 20వేల మంది ఒకేసారి ధ్యానం చేసుకునేలా 7 అంతస్తుల్లో నిర్మాణం అయ్యింది. మన రామాయణ మహాభారత ఇతిహాసాలను ప్రతిబింబించేలా కళాకృతులు దీనిలో దర్శనమిస్తాయి.

ఈ మహా మందిర్ ధామ్ నిర్వాహకులు స్వతంత్ర దేవ్ మహారాజ్, విజ్ఞానంద్ దేవ్ మహారాజ్ కొత్తగా నిర్మించిన ప్రాంగణాన్ని ప్రధాన మంత్రికి వివరించారు. కమలాకృతిలో ఉన్న పైకప్పు ప్రధానిని విశేషంగా ఆకట్టుకుంది. ఇక నవ భారతాన్ని ఆవిష్కరించే క్రమంలో నవ సూత్రాలను ప్రధాని వివరిస్తూ ఒక్క నీటి బొట్టు కూడా వృధా కాకుండా జల సంరక్షణ చేపట్టాలని, డిజిటల్ లావాదేవీల పట్ల అందరిలో చైతన్యం తేవాలని, గ్రామాలు, పట్టణాలలో స్వచ్ఛత పై దృష్టి సారించాలని సూచించారు.

స్థానిక వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలని, మేడ్ ఇన్ ఇండియాను ప్రోత్సహించాలని ప్రధాని తెలిపారు. చిరుధాన్యాలు నిత్యజీవితంలో భాగం అయిపోవాలని, ప్రకృతి వ్యవసాయానికి రైతులజు ప్రోత్సహించాలని ప్రధానమంత్రి పిలుపు నిచ్చారు.