Modi Govt: ఆ విషయంలో తెలుగు రాష్ట్రాల సీఎంల కంటే..మోదీనే బెటర్ అట…ఎందుకో తెలుసా..?

ప్రజల సొమ్మును అడ్డగోలుగా కాకుండా ఆచితూచి ఖర్చు చేయాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు.

  • Written By:
  • Updated On - July 29, 2022 / 11:54 AM IST

ప్రజల సొమ్మును అడ్డగోలుగా కాకుండా ఆచితూచి ఖర్చు చేయాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇమేజ్ ను పెంచుకునేందుకు ఇచ్చే ప్రాధాన్యత…ప్రజాసొమ్మును రక్షించే విషయంలో అంతగా పట్టించుకోలేని పరిస్థితి ప్రభుత్వాలది. ఉచిత పథకాలతో ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న వైనం తెలిసిందే. తమ ఘనతను చాటి చెప్పేందుకు భారీ ఎత్తున ప్రకటనలు ఇవ్వడంలోనూ మోదీ సర్కార్ ఎంత ఖర్చ చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు.

ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ జవాబిచ్చారు. ఇంతకూ ఆ ఎంపీ అడిగిన ప్రశ్న ఏంటంటే….గడిచిన 5ఏళ్లలో దేశంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల రూపంలో ఎంత ఖర్చు చేశారు..? ఈ ప్రశ్నను సంధించారు. దీనికి సమాధానం ఇచ్చిన మంత్రి…2017 నుంచి ఇప్పటివరకు అంటే 5ఏళ్లలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల రూపంలో పెట్టిన ఖర్చు మొత్తం అక్షరాల రూ. 3339,49కోట్లుగా వెల్లడించింది. ఇంత భారీ మొత్తాన్ని కేవలం మోదీ సర్కార్ ప్రమోషన్ కోసం ఖర్చు చేసినట్లు చెప్పారు. దీనిలోప్రింట్ మీడియాలో అత్యధికంగా రూ. 1756.48కోట్లు. ఎలక్ట్రానిక్ మీడియా కోసం రూ. 1583.01కోట్లు.

ఏడాదికి సుమారు రూ. 650కోట్లు ఖర్చు చేసినట్లు తేలింది. రెండు తెలుగురాష్ట్రాల్లో పెట్టే ఖర్చుతో పోల్చినట్లయితే…ఇదేమీ పెద్ద ఖర్చు కాదు. ఈ మధ్యే ఏపీలో జగన్ ప్రభుత్వంలో ఓ పథకాన్ని ప్రారంభించి….దానికి కోసం రూ. 60కోట్లు ఖర్చు చేసింది. తెలంగాలోనూ యాడ్స్ మీద భారీగా ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో యాడ్స్ పై పెట్టిన ఖర్చుతో పోల్చితే మోదీ దేశవ్యాప్తంగా చేసిన ఖర్చు తక్కువే అనే మాట కూడా వినిపిస్తోంది.