eKYC UPDATE: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..eKYC గడువుపై అప్ డేట్..!!

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి...భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల కోసం ప్రవేశపెట్టిన స్కీమ్ ఇది. ఈ స్కీం ద్వారా రైతులకు కొంతమేర నగదు సాయాన్ని అందిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - June 23, 2022 / 09:15 AM IST

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి…భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల కోసం ప్రవేశపెట్టిన స్కీమ్ ఇది. ఈ స్కీం ద్వారా రైతులకు కొంతమేర నగదు సాయాన్ని అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం మూడు విడతలగా 6వేల రూపాయల నగదును రైతుల అకౌంట్లోజమ చేస్తుంది మోదీ సర్కార్. ఈ మధ్యే పదకొండవ విడత జమ కూడా చేసింది. అయితే 11 వ విడత డబ్బులు కొంతమంది అకౌంట్లోజమయ్యాయి. ఇంకా చాలామంది బ్యాంకు వివరాలు eKYCని పూర్తి చేయని కారణంగా వారి అకౌంట్లో 11వ విడత డబ్బులు జమకాలేదు.

అయితే 12వ విడత డబ్బులు పొందాలంటే ఈ సారి ఖచ్చితంగా eKYCపూర్తి చేసి పంట పెట్టుబడి సాయం పొందాల్సి ఉంటుంది. రైతులకు ఉపయోగకరంగా కేంద్రం eKYC గడువు జూలై 31వరకు పొడగించింది. ఈ స్కీమ్ 11వ విడతను కేంద్రం రూ. 21,000కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. 11వ విడతలో eKYCపూర్తి చేయని వారు ఇప్పుడైనా పూర్తి చేసి 12వ విడత డబ్బులు పొందాలని చెబుతోంది ప్రభుత్వం.

మరి ekyc ప్రక్రియ ఎలా పూర్తి చేయాలంటే…
1. రైతులు CSC కేంద్రాలను సంప్రదించి eKYCని పూర్తిచేయాల్సి ఉంటుంది
2. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలంటే eKYC కోసం అధికారిక వెబ్‌సైట్ pmkisan.nic.in కు వెళ్ళాలి.
3. వెబ్‌సైట్‌ ఫార్మర్స్ కార్నర్‌లో ‘OTP ఆధారిత eKYC’ పై క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.
4. ఆధార్-లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
5. మొబైల్ నెంబర్‌కు వచ్చిన ‘OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ekyc ప్రక్రియ పూర్తవుతుంది..