Site icon HashtagU Telugu

Small Savings Scheme: సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్. చిన్నపొదుపు పథకాలపై వడ్డీ పెంపు

Modi degree

Modi Uk

సామాన్యులకు మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. చిన్న పొదుపు పథకాలపై (Small Savings Scheme) పెట్టుబడి పెట్టినవారికి మంచి రాబడి ఉంటుందని ప్రకటించింది. మీరు పోస్టాఫీసు స్మాల్ సేవింగ్స్ స్కీంలో పెట్టుబడి పెట్టినట్లయితే అధిక వడ్డీని పొందుతారు. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటను 70 బేసీస్ పాయింట్స్ పెంచింది మోదీ ప్రభుత్వం.

2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికంలో, మార్చి 31న కేంద్ర ప్రభుత్వం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి ఖాతా పథకం, నెలవారీ ఆదాయ పొదుపు పథకం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, అన్ని పోస్టాఫీసులు ఫిక్స్‌డ్ డిపాజిట్లతో సహా వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటును పెంచాయి. అయితే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) స్కీమ్ వడ్డీ రేటును ప్రభుత్వం 7.1 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు.

ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటన చేసింది. ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే త్రైమాసికానికి మంత్రిత్వ శాఖ కొన్ని చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటును 70 బేసిస్ పాయింట్ల వరకు (ఒక శాతం పాయింట్ 100 బిపిఎస్‌లకు సమానం) పెంచింది.

వచ్చే నెల నుంచి కొత్త వడ్డీ రేట్లపై ఓ లుక్కేయండి:

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును 8 శాతం నుంచి 8.2 శాతానికి, కిసాన్ వికాస్ పత్ర కోసం 7.2 శాతం నుంచి 7.5 శాతానికి పెంచారు. ప్రభుత్వం ఒకటి, రెండు, మూడు, ఐదు సంవత్సరాల ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను వరుసగా 6.6 శాతం, 6.8 శాతం, 6.9 శాతం, 7.0 శాతం నుంచి 6.8 శాతానికి, 6.9 శాతం, 7.0 శాతం, 7.5 శాతానికి పెంచింది. మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ స్కీమ్ వడ్డీ రేటు కూడా ప్రస్తుతం ఉన్న 7.1 శాతం నుంచి 7.4 శాతానికి పెరిగింది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు 7 శాతం నుంచి 7.7 శాతానికి పెరిగింది.

 

అలాగే, సుకన్య సమృద్ధి యోజన హోల్డర్లు ఇప్పుడు 7.6 శాతం నుండి 8 శాతం వడ్డీని పొందుతారు. గత తొమ్మిది నెలల్లో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం మూడోసారి సవరించింది. ప్రస్తుతం చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటు 4 శాతం నుంచి 8.2 శాతం వరకు ఉంది.