Site icon HashtagU Telugu

PM Modi Bihar Visit: నితీష్ కుమార్ ను చేయి పట్టుకుని లాగిన ప్రధాని మోదీ

NDA Seat Sharing

NDA Seat Sharing

PM Modi Bihar Visit: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ రోజు బీహార్ లో పర్యటించారు . ఔరంగాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ , సామ్రాట్‌ చౌదరి , విజయ్‌ సిన్హా తదితర ప్రముఖులు ఘనస్వాగతం పలికారు ఎన్డీయేలోని ప్రముఖులంతా ప్రధాని మోదీకి పూలమాల వేసి సన్మానించారు. ఈ సమయంలో ఆసక్తికర సంఘటన ఒకటి వైరల్ గా మారింది.

ప్రధాని మోదీకి పూలమాలతో సత్కరిస్తున్న తరుణంలో నితీశ్‌ కుమార్‌ కాస్త దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో మోడీ నితీష్ చేయి పట్టుకుని లాగాడు. అయితే నితీష్ వద్దని చెప్పినా తనకి కూడా సమన గౌరవం ఇవ్వాలనుకున్న మోడీ గజమాలలోకి నితీష్ ని ఆహ్వానించారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనను చూసి జనం చప్పట్లతో అలరించారు.

ప్రధాని మోదీ భోజ్‌పురిలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.బీహార్‌కు రావడం నాకు ప్రత్యేకమైనదని అన్నారు. జననాయక్ కర్పూరి ఠాకూర్‌కు నేను భారతరత్న ఇచ్చానన్నారు.బీహార్‌లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం మరోసారి ఊపందుకుందని ప్రధాని మోదీ అన్నారు. బీహార్ అభివృద్ధి మోదీ హామీ ఇచ్చారు. బీహార్‌లో శాంతిభద్రతల పాలనపై మోడీ శపధం చేశారు. ఈ ప్రదేశంలో అక్కాచెల్లెళ్లు, కూతుళ్లకు హక్కులు రావాలని మోడీ ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి బీజేపీ ప్రభుత్వం ఈ హామీలను నెరవేర్చడానికి మరియు బీహార్ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రధాని అన్నారు.

Also Read: PM Modi : తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ అంటే అర్థం తెలిపిన ప్రధాని మోడీ