Site icon HashtagU Telugu

Narendra Modi : ఆరో దశ ఎన్నికలపై మోదీ ఫోకస్‌..

Modi (6)

Modi (6)

ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెటుకున్నారు నరేంద్ర మోదీ. ముఖ్యంగా దక్షిణంలో బలహీన పడిన బీజేపీని బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తూ.. పలుమార్లు పర్యటనలు చేశారు. అయితే.. దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు లోక్‌ సభ ఎన్నికలు ముగిసాయి. అయితే.. నేడు ఐదో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రధాని మోదీ తదుపరి ఆరో దశ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

ఈ క్రమంలోనే.. నేడు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోదీ ప్రచారం చేయనున్నారు లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో రెండు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.

ఒడిశాలో, ప్రధాని మోదీ ఉదయం 8 గంటలకు పూరీ నగరంలో రోడ్‌షో నిర్వహించి, 10:15 గంటలకు దెంకనల్‌లో, మధ్యాహ్నం 12 గంటలకు కటక్‌లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ప్రధాని పశ్చిమ బెంగాల్‌లో పర్యటించి మధ్యాహ్నం 3 గంటలకు తమ్లూక్‌లో ఎన్నికల ర్యాలీల్లో, ఝర్గ్రామ్ వద్ద సాయంత్రం 4:45గంటలకు ప్రసంగిస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

సోమవారం దేశవ్యాప్తంగా జరగనున్న ప్రధాన రాజకీయ పరిణామాలు:

Read Also :Prashant Kishor : జగన్‌ కాన్ఫిడెన్స్‌కు తూట్లు పొడిచిన ప్రశాంత్‌ కిషోర్‌