Modi Cabinet : కేంద్ర మంత్రివ‌ర్గంలో `బండి` ప‌క్కా! జీవిఎల్ కు చిగురాశ‌!!

కేంద్ర మంత్రివ‌ర్గ పున‌ర్వ‌వ్య‌స్థీక‌ర‌ణ‌కు(Modi Cabinet)టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డింది. ఈనెల 12 లేదా 18వ తేదీల్లో మార్పులు ఉంటాయ‌ని తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - July 10, 2023 / 05:43 PM IST

కేంద్ర మంత్రివ‌ర్గ పున‌ర్వ‌వ్య‌స్థీక‌ర‌ణ‌కు(Modi Cabinet)టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డింది. ఈనెల 12 లేదా 18వ తేదీల్లో మంత్రి వ‌ర్గంలో మార్పులు ఉంటాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మ‌లాసీతారామ‌న్ ఔట్ అంటూ న్యూస్ వ‌స్తోంది. ఆమె రాష్ట్ర‌ప‌తి ముర్మును సోమ‌వారం క‌లిశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి బండి సంజ‌య్ కు అవ‌కాశం ల‌భించ‌నుంది. ఆయ‌న వ‌ద్ద‌న్నా, కేంద్ర మంత్రి ప‌ద‌వి వ‌రించ‌నుంది. ఇక ఏపీ నుంచి జీవిఎల్ నర‌సింహారావుకు మంత్రివ‌ర్గంలో స్థానం ఉంటుంద‌ని తెలుస్తోంది.

కేంద్ర మంత్రివ‌ర్గ పున‌ర్వ‌వ్య‌స్థీక‌ర‌ణ‌కు టైమ్ (Modi Cabinet)

ఎన్నిక‌ల టీమ్ ను త‌యారు చేసుకుంటోన్న మోడీ భారీ మార్పుల‌కు  (Modi Cabinet) దిగుతున్నార‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోని టాక్‌. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని కొంద‌రు సీఎంల‌ను కూడా మార్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అలాగే, ఆయా రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ల‌ను కూడా భారీగా బ‌దిలీ చేస్తార‌ని వినికిడి. ప్ర‌స్తుతం తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న త‌మిళ సై ను కూడా బ‌దిలీ చేసే అవ‌కాశం ఉంద‌ని బీఆర్ఎస్ వ‌ర్గాల్లోని టాక్. ఎన్నిక‌ల స‌మీపిస్తోన్న వేళ ఇద్ద‌రికి తెలంగాణ నుంచి మంత్రి ప‌ద‌వుల‌ను ఇస్తార‌ని చ‌ర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రిగా ఉన్న కిష‌న్ రెడ్డి ఇటీవ‌ల బీజేపీ తెలంగాణ విభాగం అధ్య‌క్షునిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆయ‌న స్థానంలో బండి సంజ‌య్ కు కేంద్ర మంత్రి ప‌ద‌వి ఖాయంకాగా, ల‌క్ష్మ‌ణ్ కు కూడా మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని చర్చ జ‌రుగుతోంది.

జీవీఎల్ కు మాత్ర‌మే ఏపీ కోటా నుంచి కేంద్ర మంత్రి వ‌ర్గంలో స్థానం

ఏపీ బీజేపీ నుంచి రాజ్య‌స‌భ స‌భ్యునిగా జీవీఎల్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన ర‌మేష్ ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న మీద గుడ్ విల్ మోడీకి లేద‌ని తెలుస్తోంది. పైగా ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్ల‌కు కేంద్ర మంత్రివ‌ర్గంలో స్థానం అంటూ ఉండ‌దని ఢిల్లీ బీజేపీ కార్యాల‌యంలోని టాక్‌. ఏపీ బీజేపీలోకి ఇటీవ‌ల చేరిన మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డికి ఏ మాత్రం అవ‌కాశం ఉండ‌దు. ఇటీవ‌ల పురంధరేశ్వ‌రికి ఏపీ బీజేపీ పగ్గాల‌ను అప్ప‌గించారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవ‌లం జీవీఎల్ కు మాత్ర‌మే ఏపీ కోటా నుంచి కేంద్ర మంత్రి వ‌ర్గంలో స్థానం (Modi Cabinet)ల‌భించ‌డానికి అవ‌కాశం ఉంది.

ఎన్డీయేలో భాగ‌స్వామ్యంగా ఉండాల‌ని వైసీపీని

త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌రిగే రాజ‌స్థాన్, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, చ‌త్తీస్ గ‌డ్‌, మిజోరాంకు ఎక్కువ‌గా ప్రాధాన్యం ల‌భించ‌నుంది. ఇక ఏపీలో విష‌యానికొస్తే, ఎన్డీయేలో భాగ‌స్వామ్యంగా ఉండాల‌ని వైసీపీని చాలా రోజులుగా బీజేపీ కోరుతోంది. అదే జ‌రిగితే, కేంద్ర మంత్రులు సాయిరెడ్డి, మిథున్ రెడ్డి, నందిగం సురేష్ ఉండే అవ‌కాశం ఉంది. ఎన్నిక‌ల ఈక్వేష‌న్ దృష్ఠ్యా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బీజేపీకి దూరంగా ఉంటున్నారు. అయితే, ఎన్డీయేలో భాగ‌స్వామి కావ‌డానికి చంద్ర‌బాబు సిద్దంగా ఉన్నారు. ప్ర‌స్తుతం ముగ్గురు ఎంపీలున్న టీడీపీ ఎన్డీయేలో భాగ‌స్వామిగా మారితే, రామ్మోహ‌న్ నాయుడుకు కేంద్ర మంత్రివ‌ర్గంలో  (Modi Cabinet) ల‌భిస్తుంద‌ని ఢిల్లీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న మాట‌.

Also Read : Modi Warangal Meeting: మోడీ బీఆర్ఎస్ అవినీతి వ్యాఖ్యలపై జైరాం రమేష్ ఎటాక్

కేంద్ర మంత్రివ‌ర్గంలో మార్పుల వేళ నిర్మలా సీతారామన్‌, అర్జున్‌ రాం మేఘ్వాల్‌, భూపేంద్రయాదవ్‌, గజేంద్రసింగ్‌ షెఖావత్‌, ఎస్పీఎస్‌ బఘేల్‌, ప్రహ్లాద్‌ జోషితదితరులు బీజేపీ అధ్యక్షుడు నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ తో సమావేశమయ్యారు. పార్టీ సేవలకు వాళ్ల‌ను వినియోగించుకుంటారని తెలుస్తోంది. ప్రహ్లాద్‌ జోషి, భూపేంద్ర యాదవ్‌లకు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. 2021 జూలై7 తర్వాత మోదీ ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రివర్గాన్ని విస్తరించలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల నాటికి డ్రీమ్ టీమ్ ను మోదీ సిద్దం చేసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద రేపో,మాపో కేంద్ర మంత్రివ‌ర్గం మార్పుల‌కు జ‌ర‌గ‌బోతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి మోడీ టీమ్ లోకి ఎవ‌రు వెళనున్నారో చూద్దాం.!

Also Read : KCR-Modi: మోడీ టూరుకు మళ్లీ డుమ్మా!