Site icon HashtagU Telugu

Modi BBC : చ‌ట్టం, న్యాయం చ‌ట్రంలో మోడీ! ఆర్బీఐ, పార్ల‌మెంట్‌, సుప్రీం వేదిక‌ల్లో..!

Modi BBC

Supreme Modi

ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ చుట్టూ సాలెగూడు మాదిరిగా ఆరోప‌ణ‌లు అల‌ముకుంటున్నాయి. ఇంత‌కాలం జాతీయ మీడియా మీద పైచేయి సాధించిన మోడీకి ఇప్పుడు అంత‌ర్జాతీయ మీడియా(Modi BBC) చుక్క‌లు చూపిస్తోంది. ఆయ‌న రాజ‌కీయ జీవితంలోని లోతుల‌ను త‌వ్వి తీస్తోంది. ఇప్పుడు ఆ సంఘ‌ట‌న‌లు సుప్రీం కోర్టు(Supreme court) వ‌ర‌కు చేరడం గ‌మ‌నార్హం.

మోడీకి అంత‌ర్జాతీయ మీడియా చుక్క‌లు (Modi BBC) 

ఇటీవ‌ల బీబీసీ `ఇండియా ది మోడీ క్వ‌శ్చ‌న్` పేరుతో (Modi BBC) ఒక డాక్యుమెంట‌రీని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేసింది. ఆయ‌న సీఎంగా ఉన్న‌ప్పుడు గుజరాత్ లో జ‌రిగిన అల్ల‌ర్ల వెనుక ర‌హ‌స్యాల‌ను బ‌య‌ట‌కు తీసింది. ఆనాడు మోడీ పోషించిన రోల్ ను చూపిస్తూ డాక్యుమెంట‌రీని బీబీసీ విడుద‌ల చేసింది. కానీ, దాన్ని చూడ‌డానికి అనుమ‌తిని నిరాక‌రిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో ఆ డాక్యుమెంట‌రీ ప‌బ్లిక్ గా ఎక్క‌డా ప్లే కాలేదు. సోష‌ల్ మీడియాలోనూ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఆ మేర‌కు మోడీ స‌ర్కార్ నియంత్ర‌ణ చేసింది. కానీ, ఢిల్లీ జేఎన్టీయూ, హైదరాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ, సోష‌లిస్ట్ పార్టీలు ఆ డాక్యుమెంట్రీని ప్లే చేయాల‌ని స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డారు. యూనివ‌ర్సిటీల కేంద్రంగా జ‌రిగిన స్టూడెంట్స్ హ‌డావుడిని మోడీ స‌ర్కార్ నియంత్రించింది. ఇదే అంశంపై సుప్రీం కోర్టులో(Supreme court) కొంద‌రు పిల్ వేయ‌డం జ‌రిగింది.

Also Read : Modi-Adani : అడ్డ‌గోలు సామ్రాజ్యం కూలుతోన్న‌ వేళ! మోడీ రాజ‌నీతిపై దుమారం!

ఒక వైపు డాక్యుమెంట‌రీ వివాదం న‌డుస్తోన్న స‌మ‌యంలోనే ఆదానీ గ్రూప్ కుప్ప‌కూలిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ గ్రూప్ కు 2014 నుంచి ప్ర‌ధాని హోదాలో న‌రేంద్ర మోడీ చేసిన స‌హాయాన్ని బ‌య‌ట పెట్టాల‌ని విప‌క్షాలు భీష్మించాయి. పార్ల‌మెంట్ బడ్జెట్ స‌మావేశాల‌ను అడ్డుకుంటూ వాయిదా తీర్మానాల‌ను పెడుతూ చ‌ర్చ‌కు డిమాండ్ చేస్తున్నాయి. ఎల్ఐసీ లాంటి సంస్థ‌ల‌తో ఆదానీ గ్రూప్ షేర్ల‌ను పెద్ద ఎత్తున కోనుగోలు చేయించ‌డంలో మోడీ పాత్ర ఉంద‌ని ప్ర‌త్య‌ర్థులు అనుమానిస్తున్నారు. అంతేకాదు, శ్రీలంక ప్ర‌భుత్వం మీద ఒత్తిడి తీసుకురావ‌డం ద్వారా ఆదానీ గ్రూప్ కు ల‌బ్ది చేకూర్చే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డార‌ని మోడీ మీద ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు. ఇవే కాకుండా విదేశాల్లో ఆదానీ గ్రూప్ కంపెనీల‌కు ఆయాచితంగా ప్రాజెక్టులు వ‌చ్చేలా మోడీ(Modi BBC) లాబీయింగ్ చేశార‌ని వ‌స్తోన్న ఆరోప‌ణ‌లు కోకొల్ల‌లు.

ఆదానీ గ్రూప్ కు ఇచ్చిన రుణాల‌ను తెలియ‌చేయాల‌ని..

ప్ర‌స్తుతం ఆదానీ గ్రూప్ షేర్లు అమాంతం ప‌డిపోవ‌డంతో భార‌త్ స్టాక్ మార్కెట్ కుప్ప‌కూలింది. అంతేకాదు, భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ ఛిన్నాభిన్నం అయింద‌ని ఆర్థిక‌వేత్త‌ల అభిప్రాయం. ఇదే స‌మ‌యంలో ఆర్బీఐ స్పందిస్తూ ఆయా బ్యాంకుల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ఆదానీ గ్రూప్ కు ఇచ్చిన రుణాల‌ను తెలియ‌చేయాల‌ని కోరింది. రెండు రోజుల నుంచి ఆదానీకి అప్పు ఇచ్చిన బ్యాంకులపై ఆర్బీఐ ఆరా తీసింది. లేటెస్ట్ గా ఆర్బీఐ స్పందిస్తూ బ్యాంకింగ్ రంగానికి ఆదానీ గ్రూప్ వ‌ల‌న ఎలాంటి న‌ష్టం లేద‌ని తేల్చింది. ఆ మేర‌కు శ‌నివారం ఒక ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం.

హిడెన్ బ‌ర్గ్ నివేదిక మీద ప‌బ్లిక్ ఇంట్ర‌స్ట్ పిటిష‌న్‌(పిల్‌)

ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించే క్ర‌మంలో సాధారంగా బ్యాంకింగ్ రంగం, వ్యక్తిగత బ్యాంకులపై ఆర్బీఐ నిఘా పెడుతోంది. ఆర్బీఐ వద్ద సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ డేటాబేస్ సిస్టమ్ ఉంది. బ్యాంకులు రూ.5 కోట్లు అంతకంటే ఎక్కువ లావాదేవీలను ప‌ర్య‌వేక్షిస్తుంది. బ్యాంకుల మూలధన సమృద్ధి, ఆస్తి నాణ్యత, లిక్విడిటీ, లాభదాయకతకు సంబంధించిన వివిధ ప్రమాణాలు భేషుగ్గా ఉన్నాయ‌ని ఆర్బీఐ చెబుతోంది. బ్యాంకులు కూడా ఆర్బీఐ జారీ చేసిన లార్జ్ ఎక్స్‌పోజర్ ఫ్రేమ్‌వర్క్ మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయి. అప్రమత్తంగా ఉంటూ భారతీయ బ్యాంకింగ్ రంగం స్థిరత్వాన్ని పర్యవేక్షిస్తూనే ఉంద‌ని ఆర్బీఐ ప్ర‌క‌ట‌న‌లో తెల‌పడం చ‌ర్చ‌నీయాంశం అయింది.

Also Read : Modi: మోదీ విదేశీ ఖర్చు ఎంతో తెలుసా?.. షాక్ ఇస్తున్న లెక్కలు!

ఇదే స‌మ‌యంలో అమెరికాకు చెందిన హిడెన్ బ‌ర్గ్ నివేదిక మీద ప‌బ్లిక్ ఇంట్ర‌స్ట్ పిటిష‌న్‌(పిల్‌) సుప్రీం కోర్టు(Supreme Court)లో దాఖ‌లు అయింది. నివేదిక‌లోని అంశాల‌ను ప‌రిశీలించాల‌ని కొంద‌రు కోరారు. ఆ నివేదిక ప్ర‌కారం ఆదానీ గ్రూప్ షేర్ హోల్డ‌ర్ల‌కు న‌ష్ట‌ప‌రిచేలా ఫ్రాడ్ జ‌రిగిన విష‌యాన్ని నిగ్గు తేల్చాల‌ని పిల్ వేయ‌డం జ‌రిగింది. గ‌తంలో హ‌ర్ష‌ద్ మోహ‌తా స్టాక్ మార్కెట్ కుంభ‌కోణాన్ని చూశాం. ఆ త‌రువాత స‌త్యం కుంభ‌కోణం అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు హ‌ర్ష‌ద్ మోహ‌తా, స‌త్యం కుంభ‌కోణాల‌ను మిక్స్ చేసి చూస్తే ఆదానీ గ్రూప్ అక్ర‌మాలు క‌నిపిస్తున్నాయ‌ని ఆర్థిక వేత్త‌లు అంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో సుప్రీం కోర్టులో దాఖ‌లైన పిటిష‌న్ మీద సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. ఇదే స‌మ‌యంలో బీబీసీ డాక్యుమెంట‌రీ (Modi BBC)ప్ర‌ద‌ర్శ‌న‌ను కేంద్ర సర్కార్ ఆపేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఒక పిల్ దాఖ‌లు అయింది. ఈ రెండు ప్ర‌త్య‌క్షంగానూ, ప‌రోక్షంగానూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి సంబంధించిన‌వే. వీటి మీద విచార‌ణ ఇప్పుడు యావ‌త్ భార‌త్ లోని ప్ర‌జ‌ల్లో హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, ఈ రెండు అంశాల‌పై చ‌ర్చ జ‌ర‌గాల‌ని పార్ల‌మెంట్ స్తంభించిపోయింది.