Site icon HashtagU Telugu

Bharat Shakti Exercise : గర్జించిన పోఖ్రాన్‌.. యుద్ధ విమానాలు, డ్రోన్లు, మిస్సైళ్లతో సందడి

Bharat Shakti Exercise

Bharat Shakti Exercise

Bharat Shakti Exercise : తేజస్ యుద్ధ విమానాల నుంచి డ్రోన్ విధ్వంసక వ్యవస్థల దాకా..  ఆధునిక తుపాకుల నుంచి క్షిపణుల దాకా ప్రతీదీ వాడుకొని భారత సైన్యం రాజస్థాన్‌‌లోని పోఖ్రాన్ ఫైరింగ్‌ రేంజ్‌లో 50 నిమిషాలు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఆయా ఆయుధాలతో శత్రుమూకలను ఎలా తుద ముట్టిస్తారో కళ్లకు కట్టేలా ఈ ప్రదర్శన కొనసాగింది. ‘భారత్ శక్తి’ పేరుతో నిర్వహించిన ఈ ప్రదర్శనతో భారత ఆర్మీ సత్తా యావత్ ప్రపంచానికి తెలిసొచ్చింది. ఈ ప్రదర్శనను నేరుగా అక్కడి వేదికపై కూర్చొని తిలకించిన వారిలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు 30కిపైగా దేశాల ప్రతినిధులు ఉన్నారు. ‘‘భారత్ శక్తి  విన్యాసాల సమయంలో గగనతలంలో విమానాల గర్జన, నేలపై ప్రదర్శించబడిన శౌర్యం నవ భారతదేశానికి  నాంది లాంటిది’’ అని ఈసందర్భంగా ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారతదేశం యొక్క ఆత్మనిర్భరత, ఆత్మ విశ్వాసం, ఆత్మగౌరవం అనే త్రిశక్తులకు పోఖ్రాన్ సాక్షిగా నిలిచిందని కొనియాడారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read :Agni V – Hyderabad : ‘అగ్ని-5’ మిస్సైల్ పురిటిగడ్డ మన హైదరాబాదే