Modi-adani : పార్ల‌మెంట్ లో విప‌క్షాల ఆందోళ‌న‌, అదానీ గ్రూపు ప‌త‌నంపై ర‌చ్చ‌!

అదానీ సంక్షోభం పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల‌ను కుదిపేస్తోంది.మోడీ,అదానీ (Modi-adani)మ‌ధ్య

  • Written By:
  • Publish Date - February 6, 2023 / 01:53 PM IST

అదానీ గ్రూప్ సంక్షోభం పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల‌ను కుదిపేస్తోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, అదానీ (Modi-adani)మ‌ధ్య ఉన్న బంధాన్ని విప‌క్షాల‌న్నీ ఏక‌తాటిపై నిల‌దీయ‌డం దుమారాన్ని రేపుతోంది. వ‌రుస‌గా మూడో రోజు కూడా లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ కార్య‌క‌లాపాలు(Parliament) జ‌ర‌గ‌కుండా విప‌క్ష లీడ‌ర్లు అడ్డుకుంటున్నారు. వాయిదా తీర్మానాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా ఆదానీ, మోడీ మ‌ధ్య జ‌రిగిన చీక‌టి కోణాల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని యోచిస్తున్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ విష‌యంపై మోడీ స‌ర్కార్ ను నిల‌దీస్తోంది. ఇటీవ‌ల జాతీయ పార్టీగా అవ‌త‌రించిన బీఆర్ఎస్ కూడా వాయిదా తీర్మానాలు పెడుతూ ఆదానీ, మోడీ మ‌ధ్య బంధాన్ని నిల‌దీస్తోంది.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, అదానీ మ‌ధ్య ఉన్న బంధాన్ని..(Modi-adani)

ఆయా దేశాల్లోని షెల్ కంపెనీల వ్య‌వ‌హారం, అదానీ గ్రూప్ తో సుదీర్ఘంగా న‌రేంద్ర మోడీకి ఉన్న అనుబంధంపై(Modi-adani) చ‌ర్చించాల‌ని విప‌క్షాలు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఆందోళ‌న‌కు దిగాయి. లోక్ స‌భ , రాజ్య‌స‌భ స‌మావేశాల‌ను అడ్డుకుంటూ నినాదాలు చేశారు. దీంతో సోమ‌వారం కూడా సోమవారం పార్లమెంట్ వేదిక‌గా మోడీ ప్రభుత్వంపై ఉమ్మడి ప్రతిపక్షం ఒత్తిడి పెంచింది. ఒక అమెరికన్ షార్ట్-సెల్లర్ తన షేర్లను క్రాష్ చేసినందుకు అదానీ గ్రూప్ కుప్ప‌కూల‌డంపై జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ(Parliament) విచార‌ణ కు ఆదేశించాల‌ని ప్ర‌ధాన డిమాండ్ విప‌క్షాల నుంచి వినిపిస్తోంది. ఆ డిమాండ్ తో నినాదాలు చేస్తూ విప‌క్ష లీడ‌ర్లు గంద‌ర‌గోళం సృష్టించ‌డంతో ఉభ‌య స‌భ‌లు స్తంభించిపోవ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Adani Wealth: పది రోజుల్లోనే అదానీ సంపద రూ. 9 లక్షల కోట్లు అవుట్!

గ‌త కొన్ని రోజులుగా సాగుతోన్న ఈ వివాదంపై ప్రధాని న‌రేంద్ర మోడీ పార్ల‌మెంట్ వేదిక‌గా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే డిమాండ్ చేస్తున్నారు. అదానీ సంక్షోభంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయన్న విష‌యాన్ని కేసీ వేణుగోపాల్ సోమవారం పునరుద్ఘాటించారు. ప్ర‌భుత్వం అదానీ గ్రూప్ వ్య‌వ‌హారాన్ని దాచిపెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోప‌ణ‌ల‌కు విప‌క్షాలు దిగాయి. చ‌ర్చ‌కు సిద్దం కాకుండా వెన‌క్కు వెళుతోంద‌ని విమ‌ర్శించారు. అదానీకి ఎందుకు ర‌క్ష‌ణ‌గా ఎన్డీయే నిలుస్తోంది? చ‌ర్చ‌కు ఎందుకు రాలేక‌పోతుంది? మోడీ, అదానీ మ‌ధ్య ఉన్న బంధంపై చ‌ర్చించాల‌ని విప‌క్షాల‌న్నీ ఏకం కావ‌డం అధికార ప‌క్షాన్ని ఇబ్బంది పెడుతోంది.

హిండెన్ బ‌ర్గ్ అధ్య‌య‌నం అదానీ గ్రూప్ చీక‌టి కోణాల‌ను…

బిలియనీర్ గౌతమ్ అదానీ గ‌త ప‌దేళ్లుగా దేశ , విదేశాల్లోని ఓడ‌రేవులు, ఎన‌ర్జీ, మీడియా త‌దిత‌ర రంగాల్లోకి వేగంగా ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌పంచ నెంబ‌ర్ 3 కుబేరుడిగా అవత‌రించారు. భార‌త్ నుంచి ప్ర‌పంచ‌లోని వివిధ దేశాల‌కు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రింప చేశారు. అంబానీల‌ను దాటుకుంటూ వ‌రల్డ్ నెంబ‌ర్ 3 కుబేరునిగా ఎద‌గ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రిచింది. కానీ, అమెరికాకు చెందిని హిండెన్ బ‌ర్గ్ అధ్య‌య‌నం అదానీ గ్రూప్ చీక‌టి కోణాల‌ను బ‌య‌ట‌పెట్టింది. డొల్ల కంపెనీలు, స్టాక్ మార్కెట్ మోసం, అకౌంట్ల‌లో చీటింగ్ వెర‌సి అదానీ గ్రూపు చీక‌టి సామ్రాజ్యాన్ని నిల‌దీస్తూ కొన్ని వంద‌ల పేజీల నివేదిక బ‌య‌ట‌పెట్టింది. ఆనాటి నుంచి షేర్ల విలువ త‌గ్గుతూ ల‌క్ష‌ల కోట్ల‌ను న‌ష్ట‌పోయింది. ఫ‌లితంగా షేర్ల కొనుగోలుదారులు రోడ్డు ప‌డ్డారు. ఇదే విష‌యంపై చ‌ర్చించ‌డానికి పార్ల‌మెంట్ వేదిక‌గా విప‌క్షాల‌న్నీ(parliament) ఏక‌తాటిపైకొచ్చి డిమాండ్ చేయ‌డం న‌రేంద్ర మోడీకి తల‌నొప్పిగా మారింది.

Also Read : Modi BBC : చ‌ట్టం, న్యాయం చ‌ట్రంలో మోడీ! ఆర్బీఐ, పార్ల‌మెంట్‌, సుప్రీం వేదిక‌ల్లో..!

పారిశ్రామికవేత్తల లిస్టెడ్ కంపెనీలు వాటి విలువలో $100 బిలియన్ల కంటే ఎక్కువ శుక్ర‌వారం నాటికి నష్టపోయాయి. ఫాలో-ఆన్ ధర ఆఫర్ నిలిపివేయబడింది. ఒకప్పుడు ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్నుడైన అదానీ ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 17వ స్థానానికి పడిపోయాడు. గ్రూప్‌లోని ఏడు లిస్టెడ్ కంపెనీలలో అమ్మకాలు సోమవారం కూడా కొనసాగాయి. గ్రూప్ లోని కీల‌క అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రారంభ వాణిజ్యంలో మరింత 9.6 శాతం పడిపోయింది.అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ 10 శాతం క్షీణించగా, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, అదానీ పవర్ మరియు అదానీ విల్మార్ దాదాపు 5 శాతం పడిపోయాయి. అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ మాత్రమే 1.2 శాతం వృద్ధితో గ్రీన్‌లో ఉన్నాయి.

పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌లు స్తంభించిపోవ‌డం మోడీ స‌ర్కార్ నిర్వాకాన్ని..

“బిలియనీర్ మరియు అతని వ్యాపార సామ్రాజ్యం భవిష్యత్తుతో పాటు, ఇంకా పెద్దది ఏదో ఉందని ఫైనాన్షియ‌ల్ టైమ్స్ అనుమానం వ్య‌క్తం చేసింది. కార్పొరేట్ పాలనలో(Modi-adani) భారతదేశం అభివృద్ధి నమూనా ప‌క్క‌దోవ పట్టింది. కొంతమంది కుబేరుల‌కు భార‌త సంప‌ద అప్పగించబడింది. మౌలిక సదుపాయాలను అమలు చేయడం, దేశాలలో పెట్టుబడులకు మార్గదర్శకత్వం చేయడంతో సామాన్య షేర్ హోల్డ‌ర్ల‌ను ప్ర‌మాదంలోకి దించింది. నియంత్రణాధికారులు మౌనంగా ఉండడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్డీయే హయాంలో అదానీ గ్రూప్‌ ఆదాయం రెట్టింపు అయ్యిందని వారు అభిప్రాయపడ్డారు. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత పెద్ద స్కామ్ గా పేర్కొంటూ విచార‌ణ జ‌రిపించాల‌ని విప‌క్ష లీడ‌ర్లు ప‌ట్టుబ‌డుతున్నారు. ఫ‌లితంగా పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌లు స్తంభించిపోవ‌డం మోడీ స‌ర్కార్ నిర్వాకాన్ని ప్ర‌శ్నిస్తోంది.