కేంద్ర ప్రభుత్వం రేపు ( గురువారం) పార్లమెంట్ (Parliament )లో తాత్కాలిక బడ్జెట్‌ను (Budget 2024) ప్రవేశపెట్టనుంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న వేళ ఈ మధ్యతర బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బిజెపి ఈ మధ్యంతర పద్దులో జనాకర్షక నిర్ణయాలేవైనా ప్రకటిస్తుందా లేదా అన్నది చూడాలి.
ఇదిలా ఉంటె పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం అయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంతో మొదలై…ఫిబ్రవరి 9న ఈ సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు మద్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో మోడీ (PM Modi) మీడియా తో మాట్లాడుతూ..ఈసారి ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్ ఒక దిశానిర్దేశం చేసేదిగా ఉంటుందని ప్రధాని చెప్పుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
దేశం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోందని..మరిన్ని కొత్త శిఖరాలను అధిరోహిస్తుందనే నమ్మకం తనకు ఉందని మోడీ చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో కూడా తాము గెలుస్తామని అప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రధాని తెలిపారు. ప్రస్తుతం అంతా నారీశక్తి నడుస్తోందని అన్నారు. కొత్త పార్లమెంటు భవనం మొదటి సమావేశాల్లో నారీ శక్తి వందన్ అధినీయమ్ అని మహిళా రిజర్వేషన్లకు ఆమోదం తెలిపాము. తర్వాత మొన్న జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో నారీశక్తిని ప్రపంచానికి చాటి చెప్పాం. ఇప్పుడు కూడా మొదట రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకొచ్చారు.
Read Also : Kumari Aunty : కుమారి ఆంటీకి సినీ హీరో మద్దతు..తప్పకుండా సాయం చేస్తానని భరోసా ..!!