Shocking : ఒడిశా రాష్ట్ర గజపతి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. 60 ఏళ్ల వృద్ధుడు తన భార్య మృతి చెంది నాలుగేళ్లు అయ్యింది. అప్పటి నుంచి వృద్ధుడు ఒంటరిగా ఉండిపోయాడు. అయితే, కొద్దికొద్దిగా అతని వికారపు కోరికలు పెరిగి, అవి ఆచరణకు దిగుతున్నాడు.
ఆ వృద్ధుడు.. గ్రామంలో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ, వారిపై అసభ్యంగా ప్రవర్తించేవాడట. అర్థరాత్రి సమయంలో ఎవరు ఇంట్లో లేని సమయంలో మహిళలు ఒంటరిగా ఉన్నారు అన్న సమాచారం తెలిసిన వెంటనే అక్కడికి వెళ్లి దౌర్జన్యానికి పాల్పడేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఐదుగురు మహిళలపై అలా అఘాయిత్యానికి పాల్పడ్డట్లు బాధితుల చెబుతున్నారు. అయితే ‘పరిస్థితి బయటికి వెళితే పరువు పోతుంది’ అనే భయంతో వారెవరికీ చెప్పలేకపోయారు.
కానీ, ఈ నెల 3న అదే వృద్ధుడు ఓ 52 ఏళ్ల వితంతువుపై లైంగిక దాడి చేశాడు. ఈ విషయం తెలిసిన మిగతా బాధితులు.. తమకూ ఇలానే దాడులు జరిగాయని ఆ వితంతువుతో పంచుకున్నారు. దీంతో ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే అతడిని ఏదో చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
ఆ మహిళలు మిగతా ఇద్దరు మహిళలతో పాటు ఇద్దరు పురుషులకు ఈ విషయాన్ని చెప్పారు. మొత్తంగా 10 మంది కలిసి జూన్ 3 అర్థరాత్రి అతడి ఇంటికి వెళ్లి ముందుగా దాడి చేశారు. తరువాత అతడిని గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లి, అక్కడే బతికుండగానే శరీరానికి నిప్పంటించి చంపేశారు. బూడిద అయ్యే వరకు అక్కడే ఉండి, తర్వాత తమ ఇళ్లకు వెళ్లిపోయారు.
వృద్ధుడు కనిపించకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టగా ఆ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ పోలీసులు ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు మహిళలు, ఇద్దరు మహిళా సహాయకులు, ఇద్దరు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తులు ముక్తకంఠంతో వృద్ధుడి దుశ్చర్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణిపై వరుస కేసులు..మరో రెండు నమోదు