Site icon HashtagU Telugu

Women’s Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తున్నామని తెలిపిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha Women's Reservation Bill

MLC Kavitha Women's Reservation Bill

మహిళా రిజర్వేషన్ బిల్లు(Women’s Reservation Bill)కు మోడీ మంత్రివర్గం (Modi Cabinet) ఆమోదం తెలుపడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు BRS ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha). లోక్ సభలో తాము పూర్తిగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు పలుకుతామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం తెస్తున్నందుకు సంతోషంగా ఉందని కవిత అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును (Women’s Reservation Bill) లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక బీఆర్‌ఎస్‌ (BRS) కృషి ఉందన్నారు. మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి కేంద్ర కేబినెట్‌ ఒక మంచి నిర్ణయం తీసుకుందన్నారు.

Read Also : Women’s Bill : మహిళా బిల్లుపై మహా సస్పెన్స్

అధికారంలో సగం కావాలన్న మహిళ కల సాకారం కాబోతున్నదని, ఇది దేశంలోని ప్రతిఒక్క మహిళ విజయమన్నారు. దేశ పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లులో (Women Reservation Bill) ఇంతకుముందు పేర్కొన్న అంశాలే ఉన్నాయా? లేక పూర్తిగా మార్పులు చేసిన బిల్లును ప్రవేశపెడుతున్నారా? అని కవిత (Kalvakuntla Kavitha) ప్రశ్నించారు. గతంలో రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్‌ బిల్లులోని అంశాలే ఇందులో కూడా ఉన్నాయా లేదా అనే దానిపై తమకు స్పష్టత కావాలని అన్నారు. చట్టసభల్లోకి మరింత మంది మహిళలు రావాలని కవిత ఆకాంక్షించారు. కాగా, సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ మంత్రివర్గం సమావేశమై మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది.