Odisha CM: ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ

రేపు బుధవారం ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణాస్వీకారం చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి గత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ కూడా ఆహ్వానించారు. ఒడిశా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం నవీన్ పట్నాయక్‌తో సమావేశమైంది.

Odisha CM: ఎన్నికల ఫలితాల్లో ఒడిశాలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. దీంతో ఒడిశా రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ జెండా ఎగురనుంది. కాగా ఒడిశాలో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. అయితే ఈ రోజు సీఎంపై క్లారిటీ వచ్చింది. ఒడిశా బీజేపీ శాసనసభా పక్ష నేతగా మోహన్ చరణ్ మాఝీ ఎన్నికయ్యారు. కెందుజార్ సదర్ ఎమ్మెల్యే మోహన్ చరణ్ మాఝీ ఒడిశా కొత్త సీఎం కానున్నారు. వీరితో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కనకవర్ధన్ సింగ్‌దేవ్, ప్రభాతి పరిదాలను నియమించనున్నారు. ఈరోజు జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రేపు బుధవారం ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణాస్వీకారం చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి గత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ కూడా ఆహ్వానించారు. ఒడిశా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం నవీన్ పట్నాయక్‌తో సమావేశమైంది. బుధవారం జరగనున్న ఒడిశాలో తొలి బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయనను ఆహ్వానించారు.బుధవారం జనతా మైదాన్‌లో అంగరంగ వైభవంగా జరిగే కార్యక్రమంలో కొత్త ముఖ్యమంత్రి, ఆయన మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో 147 స్థానాలకు గాను 78 స్థానాలను గెలుచుకున్న బీజేపీ బుధవారం ఒడిశాలో తొలిసారిగా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

Also Read: Onion Prices : ఉల్లి ధరల దడ.. సామాన్యుల బెంబేలు