Site icon HashtagU Telugu

Haryana Girl: హర్యానాలో దారుణ ఘటన.. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య

crime

crime

హర్యానా (Haryana) లోని హిస్సార్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. నేపాల్ మూలానికి చెందిన 8 ఏళ్ల బాలికను ఓ నిందితుడు మొదట అపహరించి, ఆపై అత్యాచారం చేసిన తర్వాత హత్య చేశాడు. అంతేకాకుండా.. నిందితుడు బాలిక మృతదేహంపై ఎవరికీ తెలియకుండా ఆకులు వేశాడు. 48 గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన ఓ వ్యక్తి, అతని భార్య నగరంలోని ఓ పీజీలో వంట మనిషిగా పనిచేస్తున్నారు. అతను ఎప్పటిలాగే పని కోసం ఇంటి నుండి బయలుదేరాడు. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో టైరుతో ఆడుకుంటూ కూతురు కనిపించకుండా పోయింది. బాలిక తల్లిదండ్రులు బాలికను చుట్టుపక్కల చాలా వెతికినా ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also Read: Minister Hospitalized: మంత్రికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చుట్టుపక్కల ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఓ యువకుడు బాలికను హఫెద్ గోడౌన్ వైపుకు తీసుకువెళ్లినట్లు గుర్తించారు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకోని విచారించగా అసలు విషయం చెప్పాడు. పోలీసులు బాలిక కోసం హఫెద్ గోడౌన్ చుట్టుపక్కల ప్రాంతంలో వెతకగా.. బాలిక మృతదేహం చెత్తకుప్పలో పాక్షిక నగ్న స్థితిలో పోలీసులకు కనిపించింది. నిందితుడు బాలిక తలపై ఇటుకతో కొట్టి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతదేహం లభ్యమైన తర్వాత పోలీసులు మరో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం వెతికారు. నిందితుడు నగరంలోని సుందర్ నగర్ నివాసి. డ్రగ్స్‌కు బానిసైన నిందితుడు ఇద్దరు పిల్లలకు తండ్రి కావడంతో ఘటన అనంతరం ఇంటికి వెళ్లి పడుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై అత్యాచారం, హత్య, మృతదేహాన్ని ఛిద్రం చేయడం వంటి నేరాల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత, నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని బాలిక తండ్రి డిమాండ్ చేశాడు.

Exit mobile version