Site icon HashtagU Telugu

Attacked With Acid: మైనర్‌ బాలికపై యాసిడ్ దాడి

Acid Attack

Cropped (4)

ఢిల్లీ ఉత్తమ్‌నగర్‌లో 17 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు యాసిడ్ (Acid) దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ (Acid) దాడి సమయంలో బాలిక తన చెల్లెలితో కలిసి ఉంది. దీంతో బాధితురాలి చెల్లెలు చెప్పిన వివరాల ప్రకారం నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరొకొరి కోసం గాలిస్తున్నామని, దాడికి అసలు కారణం తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బుధవారం ఉదయం ఉత్తమ్ నగర్ సమీపంలో 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటనపై సమాచారం అందింది. మోహన్ గార్డెన్ ప్రాంతంలో బాలికపై దాడి జరిగింది.

డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ద్వారక) హర్షవర్ధన్ మాట్లాడుతూ.. “ఈరోజు ఉదయం 7.30 గంటలకు ఇద్దరు మోటార్‌సైకిల్‌పై వచ్చిన వ్యక్తులు 17 ఏళ్ల బాలికపై యాసిడ్ పోసినట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో బాలిక తన చెల్లెలితో ఉందని అధికారి తెలిపారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తుల పేర్లను బాలిక పేర్కొన్నట్లు డీసీపీ తెలిపారు. వీరిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Spurious liquor: విషాదం.. కల్తీ మద్యం సేవించి ఏడుగురు మృతి..?