Write Essay – Bail : ఓ బాలుడు నిర్లక్ష్యంగా లగ్జరీ పోర్షే కారును నడుపుతూ బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు యువకులు చనిపోయారు. మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకున్న ఓ ఘటనలో ఆ మైనర్‌కు జువైనల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈక్రమంలో కోర్టు విధించిన షరతులు(Write Essay – Bail) చర్చనీయాంశమయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join
ప్రమాదం జరిగిన తీరుపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని సదరు మైనర్‌ను కోర్టు ఆదేశించింది. మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని, భవిష్యత్‌లో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలని మైనరుకు సూచించింది. నిందితుడిని మేజర్‌గా పరిగణించి దర్యాప్తు చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని పోలీసులు కోరగా.. కోర్టు అందుకు నో చెప్పింది. బెయిల్ నిరాకరించడానికి కారణాలు కనిపించడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.
Also Read :Israel Revenge : ఇరాన్ అధ్యక్షుడి మరణం వెనుక ఇజ్రాయెల్ హస్తం ?
ఈ కేసులో నిందితుడు ప్రముఖ బిల్డర్ కొడుకు అని వెల్లడైంది. ఇటీవలే 12వ తరగతి పూర్తి చేసిన ఆ బాలుడు గత శనివారం తన స్నేహితులతో కలిసి పోర్షే కారులో పబ్‌కు వెళ్లాడు. అక్కడ మద్యం తాగాడని విచారణలో తేలింది. ఆదివారం తెల్లవారుజామున పబ్ నుంచి తిరిగొస్తుండగా కారుపై మైనర్ బాలుడు కంట్రోల్ కోల్పోయాడు. దీంతో ఎదురుగా వెళ్తున్న బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయారు.
Also Read : Vehicle Registration: షోరూమ్‌లలోనే వాహన రిజిస్ట్రేషన్ల కోసం కసరత్తు..!
అరెస్టు ప్రక్రియ ఎలా ఉండాలి?
నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రకారం.. పోలీసులు ఎవరినీ ప్రశ్నించడానికి నేరుగా అరెస్టు చేయకూడదు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలంటే ‘వారెంట్’ ఉండాలి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారెంట్ లేకుండా అరెస్టు చేయవచ్చు. అరెస్ట్ వారెంట్ అనేది నిందితుడిని అరెస్టు చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడానికి పోలీసులకు కోర్టు జారీ చేసిన రాతపూర్వక ఉత్తర్వు. ఈ వారెంట్ తనిఖీల కోసం కూడా తీసుకోవచ్చు. ఈ వారెంట్ రాతపూర్వకంగా ఉండాలి, ప్రిసైడింగ్ అధికారి సంతకం, కోర్టు సంతకం చేయాలి. అందులో నిందితుడి పేరు, చిరునామా, అతనిపై మోపిన అభియోగాల వివరాలు కూడా ఉండాలి. వీటిలో ఏ ఒక్కటైనా వారెంట్‌లో లేకుంటే, అది చెల్లదు. అలాంటి వారెంట్ ఉపయోగించి చేసిన అరెస్టు చట్టవిరుద్ధం.