Site icon HashtagU Telugu

Free Schemes : ఉచిత పథకాలతో భవిష్యత్ తరాలపై భారం మోపవద్దు – నిర్మలా సీతారామన్

Minister Nirmala Sitharaman

Minister Nirmala Sitharaman

ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ ప్రజలకు ఉచిత హామీలు (Free Schemes) ప్రకటిస్తూ అధికారంలోకి వస్తున్నాయి. ఉచిత పథకాలు అమలు చేస్తూ పోతే మానవ సమాజం జనాలంతా సోమరిపోతుల్లాగా తయారై ప్రతి పనికి మిషన్లపై ఆధారపడవలసి ఉంటుంది. 55 ఏళ్ళదాకా నిరుద్యోగ భృతి, 55 ఏళ్ళనుండి వృద్ధాప్య పింఛన్, ఇంక జీవితంలో లేదు టెన్షన్, ఉండడానికి సర్కారు ఇల్లు, ఆకలేస్తే అన్నపూర్ణ క్యాంటిన్, రోగమొస్తే ఆరోగ్య శ్రీ కార్డు, చుట్టాలొస్తే రూపాయికి కిలో సన్న బియ్యం, వంట కోసం గ్యాస్ సిలిండర్లు రూ.500 , మహిళలకు ఉచిత బస్ ప్రయాణాలు, అందరికీ ఏదో ఒక ఉచిత బంధు, పండుగ కానుకగా ఒక సంచిలో 5 ఐటమ్స్..ఇలా అన్ని ఇస్తూ పొతే మనిషి సోమరిపోతులా మారడం తప్ప మరోటి లేదు. అందుకే ఉచితాలు వద్దు ..మాకు పని కల్పించండి చాలు అంటూ చాలామంది కోరుకుంటున్నారు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఎన్నికలు రాగానే ఉచితాల పేరుతో ఓట్లు దండుకొని..ఆ ఉచితాలన్నీ తిరిగి ప్రజల నుండే వసూళ్లు చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ జనాలు మాత్రం రాజకీయపార్టీల వలలో పడిపోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Minister Nirmala Sitharaman) ఉచిత పథకాలపై కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలు అవుతున్న ఉచిత బస్సు ప్రయాణాల గురించి ఆమె ప్రస్తావించారు. ఇలా ఉచిత పథకాల అమలుతో భవిష్యత్ తరాలపై భారం మోపవద్దని సూచించారు. ఎన్నికల సమయంలో గెలుపు కోసం.. అన్ని రాజకీయ పార్టీలు.. ప్రజలకు హామీ ఇచ్చే ఉచిత పథకాలను ప్రస్తుతం సమర్ధించుకోవచ్చు కానీ.. ప్రజల అభిప్రాయం ప్రకారం పన్ను చెల్లింపుదారులకు జవాబుదారీగా ఉండాలని హితవు పలికారు.

ఫ్రీ బస్ పథకంతోపాటు మరో ఐదు హామీలతో గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని , ప్రస్తుతం కర్ణాటకలో ఏం జరుగుతుందో చూడండి.. అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు లేవని చెప్పకుండా.. ఎన్నికల హామీలను తప్పనిసరిగా గౌరవించాలని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి.. అదే సమయంలో పురుషులపై బస్సు ప్రయాణ ఛార్జీలు రెట్టింపు చేయడం వల్ల ఆ కుటుంబాలపైనే భారం పడుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రభుత్వాలు అమలు చేసే ఉచిత పథకాలపై నిజాయితీతో కూడిన చర్చ జరగాలని ఆమె పిలుపునిచ్చారు.

Read Also : Balakrishna : బాలయ్య ఏందయ్యా నీ దూకుడు..?