London Tour : భారత విదేశాంగ మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో అలజడి చోటుచేసుకుంది. ఆయన కారు వద్దకు ఓ ఖలిస్థానీ మద్దతుదారు దూసుకొచ్చాడు. భారతీయ జెండాను చించేసి నానా హంగామా సృష్టించారు. దీంతో అప్రమత్తమైన లండన్ పోలీసులు.. ఖలీస్తానీ ఉగ్రవాదితో పాటు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లండన్‌లోని ఛాఠమ్ హౌస్‌లో పలు అధికారిక సమావేశాలు ముగించుకుని జైశంకర్ బయటకు వచ్చినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.
Khalistani elements attempt to heckle India's External Affairs Minister S Jaishankar while he was leaving in a car after attending an event in London, England.
The National flag of India was desecrated.
The Govt of India must revoke the PIO/OCI cards of anti-India elements. pic.twitter.com/ogNjVkIpB6
— Anshul Saxena (@AskAnshul) March 6, 2025
Read Also: PM Modi : తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీలకు ప్రధాని శుభాకాంక్షలు
మంత్రి జైశంకర్ లండన్‌లోని ఛాఠమ్ హౌస్‌లో పలు అధికారిక సమావేశాలు ముగించుకుని బయటకు వచ్చారు. ఆ సమయంలో కొంతమంది ఖలిస్థానీ అనుకూల వ్యక్తులు అక్కడ కలకలం సృష్టించారు. తమ జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఓ దుండగుడు విదేశాంగ మంత్రి కారు వద్దకు దూసుకొచ్చాడు. అతడి చేతిలో భారత జాతీయ జెండా ఉండగా దాన్ని అవమానించేలా ప్రవర్తిస్తూ నినాదాలు చేశాడు. అప్రమత్తమైన లండన్ పోలీసులు వెంటనే అతడిని పట్టుకున్నారు. అతడితో పాటు మిగతా ఆందోళనకారులను అక్కడినుంచి తరిమికొట్టారు. ఈ ఘటనతో జైశంకర్ సైతం.. ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. జైశంకర్ పర్యటనలో జరిగిన ఈ ఘటన భారత విదేశాంగ మంత్రికి చేదు అనుభవం కలిగించింది. ఖలిస్థానీ మద్దతుదారులు జైశంకర్ పర్యటనకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేశారు.
కాగా,మంత్రి జైశంకర్ మంగళవారం (మార్చి 4) యూకే పర్యటనకు వెళ్లారు. ఈనెల 9వ తేదీ వరకు లండన్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా బ్రిటన్ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్యలు జరిపారు. వివిధ అంశాలపై ఇరువు చర్చించారు. అనంతరం ప్రపంచంలో భారతదేశ వృద్ధి.. పాత్ర అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైశంకర్ ప్రసంగించారు. ఇక యూకే పర్యటన తర్వాత జైశంకర్ ఐర్లాండ్‌కు వెళ్లనున్నారు.
Read Also: Hijab Song: హిజాబ్‌పై సాంగ్.. సింగర్‌కు 74 కొరడా దెబ్బలు