Site icon HashtagU Telugu

Minior Girl Rape : యూపీలో దారుణం.. పెళ్లి వేదిక వ‌ద్ద 12 ఏళ్ల బాలిక‌పై…!

Raped

Raped

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో దారుణం జ‌రిగింది. ఓ వివాహ వేడుకకు వచ్చిన 12 ఏళ్ల బాలికపై బాంకెట్ హాల్‌లో అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మహుఖేరా పోలీస్ సర్కిల్‌లో ఈ సంఘటన జరిగింది.ఈ నేరానికి పాల్ప‌డిన నిందితుడు ప‌రారీలో ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘ‌ట‌నపై బాలిక తన కుటుంబ సభ్యులకు తన బాధను చెప్పిందని..ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఐపిసి సెక్షన్ 376 (రేప్) కింద కేసు నమోదు చేసిన‌ట్లు ఎస్పీ కుల్దీప్ గుణవత్ తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కొన్ని ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక పెళ్లి ఊరేగింపులో భాగంగా కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లింది. అతిథులంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న సమయంలో నిందితులు ఆమెను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డార‌ని తెలిపారు.

Exit mobile version