మీకు బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉందా? ఆ అకౌంట్ లో ప్రతినెలా యావరేజ్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనే విషయం తెలుసా? యావరేజ్ మినిమం బ్యాలెన్స్ అనేది ఒక్కో బ్యాంక్ లో ఒక్కో రేంజ్ లో ఉంటుంది. ప్రతినెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ రూపంలో నిల్వ ఉంచాల్సి ఉంటుందన్న మాట. యావరేజ్ మినిమం బ్యాలెన్స్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఒక స్థాయిలో.. పట్టణాలు/నగరాల్లో ఒక స్థాయిల్లో.. మెట్రో సిటీస్ లో మరో స్థాయిలో ఉంటుంది.యావరేజ్ మినిమం బ్యాలెన్స్ ను మెయింటైన్ చేయని వినియోగదారులపై బ్యాంకులు పెనాల్టీ చార్జీలు విధిస్తుంటాయి. కొన్ని ప్రధాన బ్యాంకుల్లో దీనికి సంబంధించి అమలవుతున్న నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్‌బీఐ..
ఎస్‌బీఐ 2020 మార్చిలో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఛార్జీలను తొలగించింది. గతంలో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే రూ.5 నుంచి రూ.15 మధ్య ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేది. అకౌంట్ హోల్డర్స్ బ్యాంకులో, బ్యాంక్ బ్రాంచ్‌లల్లో నాలుగు ఉచిత ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత రూ.15 + జీఎస్‌టీ చెల్లించాలి.ఏటీఎంలో జరిపే లావాదేవీలకు ఛార్జీలు ఉంటాయి. అయితే ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
రూ.1,00,000 కన్నా ఎక్కువ మెయింటైన్ చేస్తే..
యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.1,00,000 కన్నా ఎక్కువ మెయింటైన్ చేస్తే ఎలాంటి లిమిట్ లేదు. యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.1,00,000 లోపు మెయింటైన్ చేసేవారు ఎస్‌బీఐ ఏటీఎంలల్లో 5 ఉచిత ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. మెట్రో నగరాల్లోని ఇతర ఏటీఎంలల్లో 3 ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఇతర ప్రాంతాల్లోని ఏటీఎంలల్లో 5 ఉచిత ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. లిమిట్ దాటిన తర్వాత మెట్రో నగరాల్లో ప్రతీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.20 + జీఎస్‌టీ, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.8 + జీఎస్‌టీ, ఇతర ప్రాంతాల్లో ప్రతీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.10 + జీఎస్‌టీ, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.5 + జీఎస్‌టీ సర్వీస్ ఛార్జీ చెల్లించాలి.
హెచ్డీఎఫ్సీ..
అర్బన్, మెట్రో ఏరియాల్లోని
హెచ్డీఎఫ్సీ బ్యాంకులలో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.10వేలు. సెమీ అర్బన్ ఏరియాల్లో ఇది రూ.5వేలు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.2500 మాత్రమే. ఒకవేళ ఈ బ్యాలెన్స్ లేకుంటే.. పెనాల్టీ విధిస్తారు. సెమి అర్బన్ ప్రాంతాల్లో ఈ పెనాల్టీ ప్రతినెలా దాదాపు రూ.150 నుంచి రూ.300 దాకా ఉంటుంది. మెట్రో ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగా రూ. 150 నుంచి రూ.600 రేంజ్ లో ఉంటుంది.
ఐసీఐసీఐ..
ఐసీఐసీఐ బ్యాంకు వినియోగదారులు అకౌంట్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెట్రో, అర్బన్ ఏరియాల్లో రూ.10000. ఇక సెమి అర్బన్ ఏరియాల్లో రూ.5000, రూరల్ ప్రాంతాల్లో రూ.2000. ఒకవేళ ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతే..6 శాతం రుసుము విధిస్తారు. లేదా రూ. 500 గరిష్ట జరిమానా వేస్తారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్..
ఈ బ్యాంకు ఖాతాదారులు ప్రతి మూడు నెలల వ్యవధిలో రూ.20000 యావరేజ్ బ్యాలెన్స్ నిర్వహించాలి. సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇది కేవలం రూ.1000. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 500 మాత్రమే.
కోటాక్ మహీంద్రా బ్యాంకు..
మెట్రో నగరాల్లో ఈ బ్యాంకు వినియోగదారులు రూ.10 వేల
యావరేజ్ నెలవారీ బ్యాలెన్స్ నిర్వహించాలి. పట్టణాల్లో కస్టమర్లు రూ.5వేలు యావరేజ్ నెలవారీ బ్యాలెన్స్ ఉంచితే సరిపోతుంది. ఇది పాటించకుంటే.. 6 శాతం పెనాల్టీ వేస్తారు.
ఏటీఎం కార్డ్ వినియోగదారులకు షాక్..
ఏటీఎం కార్డ్ వినియోగదారులకు బ్యాంకులు షాకిచ్చాయి. ఏటీఎం విత్ డ్రా పై అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నాయి. ఆగస్ట్ 1 నుంచి ఏటీఎం సెంటర్లలో బ్యాంకులు విధించిన 5 ఫ్రీ ట్రాన్సాక్షన్‌ల కంటే ఎక్కువ సార్లు డబ్బులు డ్రా చేసుకుంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. ఈ తరుణంలో ఏటీఎంలలో పరిమితికి మించిన ప్రతీ విత్ డ్రాల్‌పై 17 రూపాయలు, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌లపై 6 రూపాయలు అదనంగా బ్యాంకులు వసూలు చేయనున్నాయి.
ఏటీఎం ఇన్‌స్టాలేషన్, మెయింటెన్స్ ఛార్జీలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రతినెల ఏటీఎం సెంటర‍్ల నుంచి 5 సార్ల లోపు డబ్బుల్ని డ్రా చేస్తే..అందుకు అదనపు చెల్లింపులు చెల్లించే అవకాశం లేదు. అయితే తాజాగా ఆ ఐదు సార్లు దాటితే అదనపు రుసుము వసూలు చేసుకోవచ్చని ఆర్బీఐ.. బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. దీంతో కస్టమర్ల నుంచి ఏటీఎం లావాదేవీలపై రుసుమును వసూలు చేసేందుకు సిద్ధ మయ్యాయి.
తాజాగా మరోసారి..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాది జూన్‌లో నెలవారీ అదనపు ట్రాన్సాక్షన్‌లపై రూ.21 వసూలు చేసుకోవచ్చని బ్యాంకులకు చెప్పింది. దీంతో ఈ ఏడాది జనవరి 1నుంచి ఏటీఎంలో అదనపు విత్ డ్రాపై రూ.21వసూలు చేస్తున్నాయి. తాజాగా మరోసారి ఆర్బీఐ ఏటీఎంలో మనీ విత్ డ్రాపై కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారుల నుంచి బ్యాంకులు సర్వీస్ ఛార్జీలను వసూలు చేయాలని ఆదేశించింది. బ్యాంకులు సైతం ఆర్బీఐ ఆదేశాల ప్రకారం.. ఆగస్ట్ 1 నుంచి ఏటీఎం మనీ విత్ డ్రాపై అదనపు రుసుములు