Asaduddin Owaisi: ఉద్యోగాలు కష్టం…పెళ్లి చేసుకోవడం ఉత్తమం..!!

  • Written By:
  • Publish Date - November 24, 2022 / 08:19 AM IST

MIMచీఫ్ , ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అప్పుడప్పుడు సెటైర్లు వేస్తుంటారు. ఓవైసీ బీజేపీకి బీ టీం అని అరోపణలు చేస్తుంటారు కొందరు. వాటిని తిప్పికొడుతుంటారు. అయితే తాజాగా గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 1,5 వ తేదీల్లో రెండు విడుతలుగా ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లు చేసింది ఈసీ. అన్ని పార్టీలు తగ్గాఫర్ ప్రచారం నిర్వహిస్తున్నాయి. గత 27ఏళ్లుగా అధికారం చేపడుతూ వస్తున్న బీజేపీ , ప్రధాని మోదీ ట్రబుల్ షూటర్ అమిత్ షాకు ఈసారి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.

అంతేకాదు అటు కాంగ్రెస్, ఆప్, ఎంఐఎం కూడా తమ సత్తా చాటుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. ఈ 9ఏళ్ల బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో దేశంలో ఒరిగిందేమీ లేదంటూ విరుచుకుపడ్డారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోదీ…ఇప్పటి వరకు పదివేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. ఈ విషయాన్ని తాను చెప్పడంలేదని గణాంకాలతో సహా బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ చెప్పారన్నారు.

పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఓవైసీ. ఇక్కడి నిరుద్యోగులకు మోదీ ఉద్యోగాలు ఇవ్వరు…పోయిన వయస్సు తిరిగి రాదు. వెంటనే పెళ్లిళ్లు చేసుకోవాలంటూ సూచించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.