Site icon HashtagU Telugu

Bipin: రావ‌త్ హెలికాప్ట‌ర్ ప్రమాదంపై ద‌ర్యాప్తు!

Bipin And Rajnath

Bipin And Rajnath

భార‌త త్రివిధ ద‌ళాధిప‌తి బిపిన్ రావత్ ప్రయాణిస్తోన్న హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై ప్ర‌ధాని మోడీ అత్య‌వ‌స‌ర సమావేశాన్ని నిర్వ‌హించాడు. ప్ర‌మాద వివ‌రాల‌ను పార్ల‌మెంట్లో ప్ర‌క‌టించాల‌ని స‌మావేశం తీర్మానించింది. ప‌లు జాతీయ వార్త సంస్థ‌లు, ఇత‌ర మార్గాల నుంచి అందుతోన్న స‌మాచారం మేర‌కు..హెలికాప్ట‌ర్లో ప్ర‌యాణిస్తోన్న వాళ్ల సంఖ్య 14 మందిగా తెలుస్తోంది. కానీ, కొన్ని వార్త సంస్థ‌లు 9 మంది ప్ర‌యాణిస్తున్నార‌ని తెలుపుతున్నాయి. ప్ర‌యాణిస్తోన్న వాళ్ల‌లో ఐదుగురు మ‌ర‌ణించార‌ని, ఇద్ద‌రు 80శాతం కాలిన శ‌రీరంతో చికిత్స పొందుతున్నార‌ని స‌మాచారం. భార‌త త్రివిధ ద‌ళాధిప‌తి బిపిన్ రావ‌త్ ప్ర‌యాణిస్తోన్న హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలింది. ఆయ‌న ప్ర‌యాణిస్తోన్న‌ IAF Mi-17V5 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూర్ సమీపంలో ప్ర‌మాదానికి గుర‌యింది. హెలికాప్టర్‌లో బిపిన్ రావత్, అతని భార్య, డిఫెన్స్ అసిస్టెంట్, సెక్యూరిటీ కమాండోలు, IAF పైలట్‌లతో సహా మొత్తం 14 మంది ఉన్నారని ప్రాథ‌మికంగా తెలుస్తోంది. దాదాపు 80శాతం కాలిపోయిన రెండు శ‌రీరాల‌ను స్థానికులు గుర్తించార‌ని, వాళ్ల‌ను స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించార‌ని స‌మాచారం.

నీలగిరి అడవుల్లో కూలిపోయిన ఛాపర్‌కు మంటలు అంటుకున్న చిత్రాలను టీవీ ఛానళ్లు ప్ర‌సారం చేశాయి. రనీలగిరిలోని వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ ఉన్న ఆర్మీ ఫెసిలిటీకి క్ష‌త‌గాత్రుల‌ను తరలించినట్లు తెలుస్తోంది. తమిళనాడులోని కోయంబత్తూరు-సూలూరు మధ్య కుప్పకూలిన హెలికాప్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, ఆయన సిబ్బందికి చెందిన అధికారులు ఉన్నారు.
జనరల్ రావత్, అతని భార్య మధులికా రావత్, బ్రిగేడియర్ ఎల్.ఎస్. అనే పేర్లతో పాటుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సిబ్బంది జాబితా ప్ర‌కారం…లిడర్ (CDSకి రక్షణ సహాయకుడు), లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్ (CDSకి ప్రత్యేక అధికారి), PSOలు నాయక్ గుర్సేవక్ సింగ్, నాయక్ జితేంద్ర కుమార్, లెఫ్టినెంట్ నాయక్ వివేక్ కుమార్, లెఫ్టినెంట్ నాయక్ B సాయి తేజ మరియు హవల్దార్ సత్పాల్ హెలికాప్ట‌ర్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.
కూనూర్‌లోని వెల్లింగ్‌టన్‌ ఆర్మీ సెంటర్‌లో శిక్షణా శిబిరంలో ఈ ప్రమాదం జరిగింది. సమీపంలోని స్థావరాల నుండి ద‌ర్యాప్తు చేయ‌డానికి అధికారులు, రెస్క్యూ టీం హుటాహుటిన అక్క‌డికి చేరుకుంది. సైట్ నుండి విజువల్స్ మంటలు, పొగ మరియు చెత్త క‌నిపిస్తోంది. రావత్ అతని సిబ్బంది, కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటో స్పష్టంగా తెలియ‌డంలేదు.

స్థానిక మిలటరీ అధికారులు ప్రదేశానికి చేరుకున్నప్పుడు, స్థానికులు 80% కాలిన గాయాలతో ఉన్న రెండు మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారని వారికి చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొన్ని మృతదేహాలు లోయ‌ల్లో ఉన్నాయ‌ని రిస్కూ టీం గుర్తించింది. మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి,