Zuckerberg Vs Indian Govt : భారత ఎన్నికలపై జుకర్‌బర్గ్‌ వ్యాఖ్యలు.. మెటాకు మోడీ సర్కారు సమన్లు

ఆ కంపెనీ భారత పార్లమెంటుకు, ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’’ అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా నిశికాంత్ దూబే(Zuckerberg Vs Indian Govt)  ఒక పోస్ట్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Zuckerberg Vs Indian Govt Zuckerberg Vs Ashwini Vaishnaw Meta

Zuckerberg Vs Indian Govt : 2024లో జరిగిన భారతదేశ సార్వత్రిక ఎన్నికలపై ఫేస్‌బుక్ (మెటా) అధినేత మార్క్ జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.  ఈ అంశాన్ని కేంద్రంలోని మోడీ సర్కారు సీరియస్‌గా తీసుకుంది. అందుకే మార్క్ జుకర్ బర్గ్‌కు కేంద్ర సర్కారు సమన్లు జారీ చేసింది.  భారతదేశ ఎన్నికల ఫలితాలపై చేసిన వ్యాఖ్యల గురించి వివరణ ఇవ్వాలని కోరింది. మెటా కంపెనీకి భారతదేశ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ చేసిన అంశాన్ని బీజేపీ ఎంపీ, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హౌస్ ప్యానల్ ఛైర్మన్ నిశికాంత్ దూబే వెల్లడించారు. ‘‘భారత్ అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. దీనిపై తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేయడం సరికాదు.  అలాంటి చర్యల వల్ల భారతదేశ ప్రతిష్ఠ దెబ్బతింటుంది.  భారతదేశ ఎన్నికల ఫలితాలపై జుకర్ బర్గ్ తప్పుడు వ్యాఖ్యలు చేశారు. తద్వారా జరిగిన పొరపాటును సరిదిద్దుకునేందుకు మెటా కంపెనీకి అవకాశం ఇస్తున్నాం. ఆ కంపెనీ భారత పార్లమెంటుకు, ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’’ అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా నిశికాంత్ దూబే(Zuckerberg Vs Indian Govt)  ఒక పోస్ట్ చేశారు.

Also Read :AP Deputy CM : డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ ? టీడీపీ నేత మహాసేన రాజేష్ సంచలన వీడియో

జుకర్ బర్గ్ ఏమన్నారు ?

‘‘2024లో వివిధ ప్రపంచ దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీలు ప్రజావిశ్వాసాన్ని కోల్పోయినట్లు రుజువైంది. భారత్‌లోనూ స్పష్టంగా ఆ ట్రెండ్ కనిపించింది. ధరల మంట (ద్రవ్యోల్బణం),  కరోనా సంక్షోభ కాలంలో అమలుచేసిన అడ్డదిడ్డమైన ఆర్థిక విధానాల ప్రతికూల ప్రభావంతో  అధికార పార్టీలపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు. దాని పర్యవసానం ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. చాలాదేశాల్లో అధికార పార్టీలు గద్దె దిగాల్సి వచ్చింది’’ అని జుకర్ బర్గ్(Zuckerberg Vs Ashwini Vaishnaw) వ్యాఖ్యానించారు.

Also Read :Zuckerberg Vs Ashwini Vaishnaw : భారత ఎన్నికలపై మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు.. ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కౌంటర్

ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. 

జుకర్ బర్గ్ అభిప్రాయంతో భారత ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా విభేదించారు. దీనిపై ఆయన ‘ఎక్స్’(ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.‘‘భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ. 2024లో కోట్లాది మంది ఓటర్లతో విజయవంతంగా ఎన్నికల ప్రక్రియ జరిగింది. మరోసారి భారతీయులు ప్రధాని మోడీ నాయకత్వాన్ని విశ్వసించారు. మళ్లీ ఎన్డీయే కూటమికే అధికార పట్టం కట్టారు’’ అని ఆ పోస్ట్‌లో అశ్వినీ వైష్ణవ్ రాసుకొచ్చారు.

  Last Updated: 14 Jan 2025, 04:37 PM IST