Explore the universe together:స్వాతంత్ర వజ్రోత్సవ భారత్ కు.. “అంతరిక్ష” సందేశం!!

స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుపుకొంటున్న భారత్‌కు ఒక ప్రత్యేకమైన చోటు నుంచి కూడా విషెస్ అందాయి. అదే అంతరిక్షం.

  • Written By:
  • Publish Date - August 15, 2022 / 07:00 AM IST

స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుపుకొంటున్న భారత్‌కు ఒక ప్రత్యేకమైన చోటు నుంచి కూడా విషెస్ అందాయి. అదే అంతరిక్షం. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్న భారత మూలాలున్న ఇటలీ వ్యోమగాగి  సమంత భారత్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ “నాసా”, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ “ఈసా”, ఇతర సంస్థల తరపున శుభాకాంక్షలు చెబుతున్నట్లు సమంత తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)’ వచ్చే ఏడాది చేపట్టనున్న ‘గగన్‌యాన్’ కార్యక్రమం విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు.

ఇస్రో చేపట్టిన ‘గగన్‌యాన్’ మిషన్ తో పాటు ‘నిసార్ ఎర్త్ సైన్స్ మిషన్’ గురించి ఈసందర్భంగా ప్రస్తావించారు. “మారుతున్న వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, భూమిపై విపత్తులను ముందస్తుగా గుర్తించడానికి దోహదపడే “నిసార్” ఎర్త్ సైన్స్ మిషన్‌ను అభివృద్ధి చేయడం కోసం ఇస్రో కృషి చేస్తోంది” అని సమంత గుర్తు చేశారు. ఈ వీడియో మెసేజ్‌పై ఇస్రో హర్షం వ్యక్తం చేసింది. నాసాతోపాటు ఇతర సంస్థలకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేసింది.