Site icon HashtagU Telugu

Memorial for Pranab Mukherjee : RSSపై ప్రేమవల్లే ప్రణబ్‌కు స్మారకం – ఎంపీ డానిష్ అలీ

Memorial For Pranab Mukherj

Memorial For Pranab Mukherj

కాంగ్రెస్ MP డానిష్ అలీ (Congress MP Danish Ali), బీజేపీ (BJP)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్ ఘాట్‌లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి స్మారకం (Pranab Mukherjee Memorial) నిర్మించడం, అదే సమయంలో మన్మోహన్ సింగ్‌(Manmohan Singh)ను పట్టించుకోకపోవడం బీజేపీ డర్టీ పాలిటిక్స్‌కు నిదర్శనమని ఆరోపించారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరించిన మన్మోహన్ సింగ్‌ను అవమానించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. సంఘ్ పై ప్రేమ వల్లే ప్రణబ్ కు స్మారకం నిర్మిస్తున్నారని ఆరోపించారు. RSS ఫౌండర్ హెగ్దేవార్ను ఆయన ‘ధర్తీపుత్ర’గా కీర్తించారని, సావర్కర్ చిత్రాన్ని పార్లమెంటులో పెట్టించారని విమర్శించారు. డానిష్ అలీ, ప్రణబ్ ముఖర్జీని స్మరించడంలో తప్పు లేదని, అయితే ఇది బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేలా జరుగుతుందన్నారు.

Sam Konstas: విరాట్ కోహ్లీ నా ఆరాధ్య దైవం.. ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మెన్ సామ్ కాన్స్టాస్‌

RSSతో సంబంధాలు ఉన్న వ్యక్తులను మాత్రమే బీజేపీ ప్రోత్సహిస్తుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మన్మోహన్ సింగ్ వంటి నాయకుల సేవలను నిర్లక్ష్యం చేయడం తగదని ఆయన అన్నారు. బీజేపీ ఈ విమర్శలపై ఇంకా స్పందించలేదు. అయితే రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాన్ని విభజన రాజకీయాల కిందే చూస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీకి స్మారకం నిర్మించడంలో ఏదైనా నిఖార్సైన కారణం ఉందా, లేక ఇది బీజేపీ ఆజెండాలో భాగమా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రణబ్ ముఖర్జీ RSS కార్యక్రమాలకు హాజరై విమర్శలకు గురైన సందర్భాలు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన పేరు మీద స్మారకం నిర్మించడం, మన్మోహన్ సింగ్ వంటి ముఖ్యమైన నేతలను పక్కనపెట్టడం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.