Savitri Jindal : సావిత్రీ జిందాల్.. మన దేశంలోనే ధనిక మహిళ. హర్యానాలోని హిస్సార్ అసెంబ్లీ స్థానంలో ఆమె ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2014 నుంచి ఇప్పటివరకు హిసార్ ఎంపీగా వ్యవహరించిన కమల్ గుప్తాకు ఈసారి బీజేపీ హిసార్ (Savitri Jindal) అసెంబ్లీ టికెట్‌ను ఇచ్చింది. ఆయనపై సావిత్రీ జిందాల్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఆమె గతంలో 2005 నుంచి 2013 వరకు కాంగ్రెస్ టికెట్‌పై హిస్సార్ సీటును గెల్చుకున్నారు. సావిత్రీ జిందాల్ కుమారుడు నవీన్ జిందాల్ ప్రస్తుతం హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. హిస్సార్ అసెంబ్లీ ఎన్నిక గురించి ఇటీవలే నవీన్ జిందాల్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘‘హిస్సార్ అసెంబ్లీ స్థానంలో మా అమ్మ కచ్చితంగా గెలుస్తారు. అక్కడ ఏకపక్ష పోటీ ఉంటుంది. ఆమెకు భారీ మెజారిటీ వస్తుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు. హిస్సార్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున రాంనివాస్ రారా పోటీ చేస్తున్నారు.
Also Read :Afzal Gurus Brother: ఎన్నికల బరిలో అఫ్జల్ గురు సోదరుడు.. భవితవ్యం తేలేది నేడే
పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉంది. ఈ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. బిజ్‌బెహరా – శ్రీగుఫ్వారా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఇల్తిజా ముఫ్తీ దాదాపు 800 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి బషీర్ షా ముందంజలో ఉన్నారు. చివరిసారిగా ఈ స్థానంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ అభ్యర్థి అబ్దుల్ రెహమాన్ భట్ గెలిచారు. ఆ టైంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి బషీర్ అహ్మద్ షా 2,868 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొత్తం మీద ఈ స్థానంలో ఎవరు గెలుస్తారు అనేది కాసేపట్లో తెలిసిపోనుంది.