Site icon HashtagU Telugu

Mukesh Ambani – Trumph : ట్రంప్‌తో ముకేశ్ అంబానీ భేటీ..

Mukesh Ambani Trumph

Mukesh Ambani Trumph

Mukesh Ambani – Trumph Meeting : ఖతార్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఖతార్ లుసైల్ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విందులో ట్రంప్‌తో పాటు ఖతార్ షేక్ ఎమిర్ తమిమ్ బిన్ హమీద్‌తో కూడా ముచ్చటించారు.

ఈ సందర్భంగా, ట్రంప్‌తో ముకేశ్ అంబానీ వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీకి సంబంధించిన వీడియో బయటకు వచ్చి, నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో, రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ, అమెరికా వాణిజ్య కార్యదర్శి స్టీవ్ లుట్నిక్‌తో స్నేహపూర్వకంగా సంభాషించడాన్ని కూడా చూడవచ్చు.

అంతేకాక, అమెరికా అధ్యక్షుడి గౌరవార్థం ఖతార్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ అధికారిక విందులో టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

జనవరిలో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, ట్రంప్‌తో ముకేశ్ అంబానీ ఇది రెండవ సమావేశం. జనవరిలో, ట్రంప్ రెండవ ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు, ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ ట్రంప్‌ను కలిశారు.