ISRO New Chief : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన ఛైర్మన్‌గా ఎస్ సోమనాథ్ స్థానంలో వి.నారాయణన్ బాధ్యతలు చేపట్టనున్నారు. భారత అంతరిక్ష శాఖ కార్యదర్శిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. వి నారాయణన్ జనవరి 14న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ రెండు కీలక పాత్రల్లో రాబోయే రెండేళ్ల పాటు లేదా తదుపరి నోటీసు వచ్చే వరకు ఆయన దేశానికి సేవలు అందించనున్నారు. ఈసందర్భంగా వి నారాయణన్ నేపథ్యం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Cashless Treatment : రోడ్డు ప్రమాద బాధితులకు రూ.లక్షన్నర నగదు రహిత చికిత్స : కేంద్ర మంత్రి గడ్కరీ
- వి.నారాయణన్(ISRO New Chief) రాకెట్, అంతరిక్ష నౌక ప్రొపల్షన్ విభాగాల్లో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన విశిష్ట శాస్త్రవేత్త.
- ఆయన రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ నిపుణుడు.
- వి.నారాయణన్ 1984లో ISROలో చేరారు.
- లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC)కు డైరెక్టర్‌గా పదోన్నతి పొందడానికి ముందు ఆయన ఇస్రోలో వివిధ హోదాల్లో పనిచేశారు.
- కెరీర్ తొలినాళ్లలో ఆయన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)లోని సౌండింగ్ రాకెట్స్ విభాగం, ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ASLV) విభాగం, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV)లోని సాలిడ్ ప్రొపల్షన్ విభాగంలో పనిచేశారు.
- అబ్లేటివ్ నాజిల్ సిస్టమ్స్, కాంపోజిట్ మోటారు కేసులు, కాంపోజిట్ ఇగ్నైటర్ కేసుల ప్రక్రియలపై వి నారాయణన్‌ను మంచి పట్టు ఉంది.
- ప్రస్తుతం నారాయణన్ బెంగళూరులోని ఒక యూనిట్‌తో పాటు తిరువనంతపురంలోని వలియమల వద్ద ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఇస్రోకు చెందిన ప్రధాన కేంద్రాలలో ఒకటైన LPSC విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
- చంద్రయాన్ 4, గగన్‌యాన్ వంటి ప్రతిష్టాత్మక మిషన్‌లకు ఇస్రో రెడీ అవుతున్న తరుణంలో వి.నారాయణన్ నియామకం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్‌ను చేర్చేందుకు ఇస్రో ఎంతో శ్రమిస్తోంది. ఈ విజయాలలో ఇస్రోకు సారథులుగా వ్యవహరించిన వారిది కీలక పాత్ర అని మనం తెలుసుకోవాలి.