Most Powerful Women : ప్రముఖ అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ ఏటా ఇచ్చే ర్యాంకింగ్స్ ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. ఈసారి 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో నలుగురు భారతీయ మహిళలకు చోటు దక్కింది. ఇందులో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 32వ స్థానంలో నిలిచారు. హెచ్‌సీఎల్ కంపెనీ సీఈవో రోష్నీ నాదర్ మల్హోత్రా 60వ స్థానంలో ఉన్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) చైర్‌పర్సన్ సోమ మొండల్ 70వ స్థానం కైవసం చేసుకున్నారు. బయోకాన్ సంస్థ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 76వ స్థానంలో ఉన్నారు. ఈజాబితాలో మొదటి స్థానంలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ దెర్ లెయెన్ తొలి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి క్రిస్టినా లగార్డ్, మూడో స్థానంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, నాలుగో స్థానంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఐదో ప్లేస్‌లో అమెరికా గాయని టేలర్ స్విప్ట్ చోటు దక్కించుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
- నిర్మలా సీతారామన్ 2019లో భారతదేశ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. ఆమె కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు సీతారామన్ యూకే ఆధారిత అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్‌లోనూ, బీబీసీ వరల్డ్ సర్వీస్‌లోనూ విభిన్న పాత్రల్లో పనిచేశారు. భారత జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా సేవలందించారు.
- హెచ్‌సీఎల్ కంపెనీ సీఈవో మల్లోహత్రా.. ప్రముఖ పారిశ్రామికవేత్త శివ్ నాడార్ కుమార్తె.
- సోమ మొండల్ సెయిల్‌కు మొదటి మహిళా చైర్‌పర్సన్. ఆమె బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిలోనే కంపెనీ లాభాలు మూడు రెట్లు పెరిగాయి.
- బయోకాన్ కంపెనీని కిరణ్ మజూందర్ షా 1978లో నెలకొల్పారు. ఆ తర్వాతి కాలంలో ఆమె భారత్‌లో అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా ఎదిగారు. బయోకాన్‌కు మలేషియాలోని జొహొర్‌లో ఆసియాలోనే అతి పెద్ద ఇన్సులిన్ పరిశ్రమ(Most Powerful Women) ఉంది.