Site icon HashtagU Telugu

షారుక్ కొడుకు ఆర్యన్ కేసుని డీల్ చేసే కొత్త ఆఫీసర్ ఈయనే

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కొడుకు కఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తున్న సమీర్ వాంఖడేను తొలగించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆయన స్థానంలో ఐపీఎస్ అధికారి సంజయ్ కుమార్ సింగ్‌ను ప్రభుత్వం నియమించింది. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారి అయిన సంజయ్ కుమార్ ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు సారథ్యం వహిస్తారు. వాంఖడే స్థానంలో సంజయ్‌ను నియమించడంపై సర్వత్ర చర్చనీయాంశమైంది.

Also Read :  పొలిటిక‌ల్ హీరో “స్టాలిన్”..త‌మిళ‌నాట రాజ‌కీయ విప్ల‌వం

ఈ కేసును మొదటినుండి ఫాలో అవుతున్న వాళ్లకి సంజయ్ కుమార్ సింగ్ ఎవరు, ఏంటి అనే క్యూరియాసిటి మొదలైంది. సంజయ్ కుమార్ సింగ్ 1996 బ్యాచ్‌కు చెందిన ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారి. ఒడిశా పోలీస్, సీబీఐలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఎన్‌సీబీలో చేరడానికి ముందు కుమార్ సింగ్ ఒడిశా డ్రగ్ టాస్క్ ఫోర్స్ (డీటీఎఫ్)లో అదనపు డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. ఆయన హయాంలో రాష్ట్రంలో వరుస యాంటీ డ్రగ్ డ్రైవ్‌లు జరిగాయి. భువనేశ్వర్‌లో పలు డ్రగ్ రాకెట్ల ఆట కట్టించారు.

Also Read : పశ్చిమ కనుమలను కాపాడుతున్న వీరవనితలు

2008 నుంచి 2015 వరకు సీబీఐలో డీఐజీగా పనిచేశారు. ఆ సమయంలో పలు హై ప్రొఫైల్ కేసులను కూడా పర్యవేక్షించారు.సంజయ్ కుమార్ సింగ్ ఒడిశా పోలీస్ ఐజీపీగా, జంట నగరాల అదనపు కమిషనర్‌గా పనిచేశారు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర దర్యాప్తు సంస్థకు డిప్యూటేషన్‌పై వెళ్లిన సంజయ్ ఎన్‌సీబీలో డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్ (డీడీజీ)గా చేరారు. సంజయ్ కుమార్ పై ఇప్పటివరకు ఎలాంటి క్రమశిక్షణ చర్యలు కానీ, క్రిమినల్ కేసులు కానీ,అవినీతి ఆరోపణలు కానీ లేవు.

Exit mobile version