Site icon HashtagU Telugu

Baba Ramdev: బాబా రామ్‌దేవ్ ఎవరి సహాయంతో పతంజలి కంపెనీని ప్రారంభించారో తెలుసా..?

Baba Ramdev

Ramdev Baba

Baba Ramdev: యోగా గురువు బాబా రామ్‌దేవ్ (Baba Ramdev), అతని సంస్థ పతంజలి పేరు నేడు దేశవ్యాప్తంగా మార్మోమోగుతోంది. అయితే ఈ సంస్థ ప్రారంభంలో ఒక జంట ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ జంట పేరు సునీత, సర్వన్ సామ్ పొద్దర్. బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ 2006లో తమ కంపెనీని స్థాపించడానికి వారి నుంచి వ్యక్తిగత రుణం తీసుకున్నారు. ఈ జంట స్కాట్లాండ్‌కు చెందిన వారు. ఈ జంట లిటిల్ కుంబ్రే అనే ద్వీపాన్ని కొనుగోలు చేసి 2009లో రామ్‌దేవ్‌కు బహుమతిగా ఇచ్చారు.

వారు ఈ ద్వీపాన్ని రెండు మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసి ఇచ్చారు. 2011 నివేదిక ప్రకారం.. సర్వన్ ‘సామ్’ పొద్దార్, అతని భార్య సునీత స్కాట్లాండ్ నివాసితులు. వారు లిటిల్ కుంబ్రే అనే ద్వీపాన్ని రెండు మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసి 2009లో బాబా రామ్‌దేవ్‌కు బహుమతిగా ఇచ్చారు.

పతంజలిలో 7.2 శాతం వాటా

ఒక నివేదిక ప్రకారం.. 2011లో ఈ జంటకు పతంజలి కంపెనీలో 7.2 శాతం వాటా ఉంది. 12.46 లక్షల షేర్లను కలిగి ఉన్నాడు. ఆచార్య బాలకృష్ణ తర్వాత కంపెనీలో 92 శాతానికి పైగా షేర్లను కలిగి ఉన్న రెండో వ్యక్తి.

బరువు తగ్గడంలో సునీతకు సహాయం చేశారు

బాబా రామ్‌దేవ్ యోగా ద్వారా సునీతకు బరువు తగ్గడానికి సహాయం చేసారు. ఇది సునీతను ఆకట్టుకుంది. ఆమెకు ద్వీపాన్ని బహుమతిగా ఇవ్వమని ఆమె భర్తను ఒప్పించింది. ఇది మాత్రమే కాదు సునీత బ్రిటన్‌లోని పతంజలి యోగపీఠ్ ట్రస్ట్‌కు ట్రస్టీ కూడా అయ్యారు.

Also Read: Rs 500 Gas Cylinder : వచ్చే నెల నుంచే ఆ రెండు పథకాలు అమల్లోకి !

ముంబైలో పుట్టింది

సునీత ముంబైలో జన్మించింది, అయితే ఆమె బాల్యం నేపాల్ రాజధాని ఖాట్మండులో గడిచింది. గ్లాస్గోలోని అత్యంత సంపన్న మహిళల్లో సునీత ఒకరు. ఆమె తొలిరోజుల్లో యోగా శిక్షకురాలిగా ప‌నిచేశారు. గ్లాస్గోలో బాబా రామ్‌దేవ్‌ను కలిశారు. ప్రస్తుతం సునీత ఓమిన్‌స్టర్ హెల్త్‌కేర్‌కు CEO, వ్యవస్థాపకురాలు. కాగా సామ్ పొద్దర్ బీహార్‌లో జన్మించాడు. అతని తండ్రి గ్లాస్గోలో వైద్యుడు. సామ్ 4 సంవత్సరాల వయస్సులో గ్లాస్గోకు వచ్చాడు. సామ్ వృత్తిరీత్యా ఇంజనీర్.

We’re now on WhatsApp. Click to Join.

సునీత, సామ్.. రామ్‌దేవ్‌కు సహాయం చేశారు

1995లో దివ్య ఫార్మసీ రిజిస్ట్రేషన్‌కు కూడా తన వద్ద డబ్బులు లేవని బాబా రామ్‌దేవ్ ఒకసారి చెప్పారు. ఆ సమయంలో యోగా గురువుగా ఆయనకు ఆదరణ తక్కువ. ఆదరణ పెరిగినప్పుడు అతను కంపెనీని విస్తరించాలని నిర్ణయించుకున్నాడు. అందులో అతనికి సునీత, సామ్ సహాయం చేశారు. కాగా.. బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి గత ఆర్థిక సంవత్సరంలో రూ.886.44 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఫోర్బ్స్ ప్రకారం ఆచార్య బాలకృష్ణ నికర విలువ రూ.29,680 కోట్లు. కంపెనీ ఆదాయం రూ.40000 కోట్లకుపైగా ఉంది.

Exit mobile version