Site icon HashtagU Telugu

Wife Frames Hubby: గన్ తెప్పించి ఇంట్లో దాచిన మహా ఇల్లాలు.. పోలీసులకే చుక్కలు చూపించిన మహిళ!

Uttar Pradesh

Uttar Pradesh

ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాల మోజులో పడి కొందరు అనవసరంగా తమ పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అలాగే లేని పోని ఆకర్షణలకు గురై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం, భర్త వేరొక మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. అయితే నిత్యం ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ ఇలా వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఒక మహిళ తన వివాహేతర సంబంధం గురించి తెలిసి భర్త తనను కొట్టాడనే కారణంతో ఓ మహిళ దారుణమైన స్కెచ్ వేసింది. అక్రమాయుధాల కేసులో భర్తను ఇరికించేందుకు ప్రయత్నించింది. భయపడిపోయిన భర్త ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఒక మహిళ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఆ విషయం ఆ మహిళ భర్తకు తెలియడంతో అతను తన భార్యను కొట్టాడు. తలకు తీవ్రగాయం కావడంతో ఆమెకు కుట్లు పడ్డాయి. అయితే ఆమె చికిత్స అనంతరం ఆ మహిళ తన భర్తపై పగ పెంచుకుంది.

ఈ నేపథ్యంలోనే ప్రియుడితో కలిసి భర్తను ఇరికించేందుకు స్కెచ్ వేసింది. దేశవాళి తుపాకీ ఇంట్లో ఉంచి పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు విచారణ జరిపి విషయం తెలుసుకున్నారు. ఆ ఫిర్యాదు ఫేక్ అని తేల్చారు. దీంతో భర్త జిల్లా ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అక్రమాయుధాల కేసులో తనను ఇరికించేందుకు భార్య చేసిన పని గురించి చెప్పారు. ప్రియుడితో కలిసి తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ చేయాల్సిందిగా ఎస్పీ స్థానిక పోలీసులను ఆదేశించారు. ఈ ఘటన పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version