MCD Election 2022: ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో నోటాకు 57 వేలకుపైగా ఓట్లు..!

  • Written By:
  • Publish Date - December 8, 2022 / 10:45 AM IST

ఢిల్లీ మున్సిపల్‌ (municipal polls in Delhi) ఎన్నికల్లో నోటాకు 57 వేలకుపైగా ఓట్లు రావడం ఆసక్తిగా మారింది. తమకు ఏ అభ్యర్థి నచ్చలేదని ఓటర్లు స్పష్టం చేయడం విశేషం. ఢిల్లీ (municipal polls in Delhi)లో మొత్తం 1,45,05,358 ఓటర్లు ఉన్నారు. MCD ఎన్నిలకల్లో 50.48 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 57,545 మంది నోటాకు ఓటేశారు. అంటే 0.78 శాతం మంది నోటావైపు మొగ్గుచూపారని ఫలితాల గణాంకాలు చెబుతున్నాయి.

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 250 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లతో మెజారిటీ మార్కును అధిగమించింది. అదే సమయంలో బీజేపీ 104, కాంగ్రెస్ 9, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాల్లో విజయం సాధించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈసారి ఢిల్లీ ప్రజలు ‘నన్ ఆఫ్ ది ఎబౌ’ అంటే నోటా బటన్‌ను నొక్కారు.

ఈసారి నోటాను 57 వేలకు పైగా ఓటర్లు తమ తొలి ఛాయిస్‌గా ఎంచుకున్నారు. అంటే తమ వార్డు అభ్యర్థులను ఇష్టపడని 57 వేల మంది ఓటర్లు ఉన్నారు. నోటాకు ఓటు వేయడానికి కారణం ఇదే. ఎంసీడీ ఎన్నికల్లో మొత్తం 73,35,825 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 57,545 లేదా మొత్తం పోలైన ఓట్లలో 0.78 శాతం నోటాను ఎంచుకున్నాయి. గత ఎన్నికల కంటే ఈ సంఖ్య 8300 ఎక్కువ.

Also Read: Tamil Nadu disaster management: తుఫాన్ ఎఫెక్ట్.. తమిళనాడులో 5,000 శిబిరాలు.. 400 మంది రెస్క్యూ వర్కర్లు

2017లో నోటాపై మొత్తం 49,235 లేదా 0.69 శాతం ఓట్లు పోలయ్యాయి. 2017 ఎన్నికల్లో ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అత్యధిక నోటా ఓట్లు నమోదయ్యాయి. అప్పుడు ఎంసీడీ ఎన్నికల్లో మొత్తం 71,36,863 ఓట్లు పోలయ్యాయి. సౌత్ కార్పొరేషన్ (SDMC) అధికార పరిధిలో NOTA కౌంట్ 19,190 (మొత్తం ఓట్లలో 0.71 శాతం), అయితే నార్త్ కార్పొరేషన్, ఈస్ట్ కార్పొరేషన్ (EDMC) అధికార పరిధిలో వరుసగా 19,762 (0.74), 10,283 (0.58) ఉన్నాయి. గత ఎన్నికల్లో MCDలో మూడు భాగాలు ఉండేవి. కానీ ఈసారి MCD ఏకీకృతమైంది.

ఎంసీడీ విజయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజలకు నేను అభినందనలు తెలుపుతున్నాను. ఇంత పెద్ద, అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు, ఇంత పెద్ద మార్పు కోసం ఢిల్లీ ప్రజలను నేను అభినందించాలనుకుంటున్నాను. ఢిల్లీని శుభ్రం చేయడం, అవినీతిని తొలగించడం, పార్కును బాగు చేయడం వంటి అనేక బాధ్యతలను ఢిల్లీ ప్రజలు నాకు అప్పగించారు. మీ ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను కష్టపడి పని చేస్తానని ఆయన తెలిపారు.