Site icon HashtagU Telugu

Congress Party : గులాం దెబ్బ‌కు కాంగ్రెస్ ఖాళీ

Ghulam nabi azad

Ghulam nabi azad

జ‌మ్మూకాశ్మ‌ర్ రాష్ట్రంలో గులాంన‌బీ ఆజాద్ దెబ్బ‌కు కాంగ్రెస్ దాదాపుగా ఖాళీ కానుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టే యోచ‌న‌లో ఉన్న ఆయ‌న కు దాదాపు 51 మంది అక్క‌డి కాంగ్రెస్ నేతలు ద‌గ్గ‌ర‌య్యార‌ని తెలుస్తోంది. ఆజాద్ రాజీనామా చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 64 మంది నేతలు పార్టీని వీడారు. గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా మంగళవారం ఇక్కడ పార్టీకి రాజీనామా చేసిన జమ్మూ కాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్ కూడా ఉన్నారు.కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి నేరుగా రాజీనామా లేఖ‌ల‌ను సమర్పించారు. మాజీ మంత్రులు అబ్దుల్ మజిద్ వానీ, మనోహర్ లాల్ శర్మ, ఘరు రామ్, మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్‌తో సహా పలువురు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ఆయన జమ్మూ కాశ్మీర్ నుంచి జాతీయ స్థాయి పార్టీని ప్రారంభించనున్నారు. మాజీ మంత్రులు, శాసనసభ్యులు సహా దాదాపు డజనుకు పైగా ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులు, వందలాది మంది పంచాయతీరాజ్‌ సంస్థ (పిఆర్‌ఐ) సభ్యులు, మున్సిపల్‌ కార్పొరేటర్‌లు, జిల్లా, బ్లాక్‌ స్థాయి నాయకులు ఇప్పటికే కాంగ్రెస్‌ను వీడి ఆజాద్‌తో చేతులు క‌లిపారు.

Exit mobile version