Site icon HashtagU Telugu

Fire Accident : గాంధీనగర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం..కోట్లాది రూపాయల ఆస్తి నష్టం..!!

Fire

Fire

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గాంధీనగర్ ప్రాంతంలో పదుల సంఖ్యలో దుకాణాలు దగ్దం అయ్యాయి. కోట్లాది రూపాయల విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. ఘటన సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. క్యానింగ్ వాటర్ ద్వారా 35 అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కొత్తగా నిర్మించిన మూడంతస్తుల భవనంలో ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమయ్యారు అగ్నిమాపక సిబ్బంది. తొలుత నాలుగు అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే మంటలు అదుపులోకి రాకపోవడంతో…మరిన్ని వాహనాలు రప్పించారు. మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించారు.

ఈ ఘటనపై ఢిల్లీ సీఎం కేజ్రివాల్ సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దాదాపు 150 మందిని 5గంటలపాటు శ్రమించి రక్షించారు అగ్నిమాపక సిబ్బంది. కాగా ఈ ప్రమాదం వల్ల ఎంత నష్టం జరిగిందో ఇంకా అంచనా వేస్తున్నారు.