Site icon HashtagU Telugu

Udhampur Bomb Blast : ఉధంపూర్ లో భారీ పేలుళ్లు..!!!

China Explosion

Bomb blast

జమ్మూకశ్మీర్ లోని ఉధంపూర్ లో భయాందోళన వాతావరణం నెలకొంది. గంటల వ్యవధిలో రెండు బాంబు పేలుళ్లు జరిగాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుళ్లలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇద్దరు వ్యక్తులకు గాయాలైనట్లు సమాచారం. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో మొదటి బాంబు పేలుడు జరగగా, ఉధంపూర్ బాంబ్ స్టాండ్ వద్ద ఆగి ఉన్న బస్సులో ఇవాళ తెల్లవారు జామున 5.42 గంటలకు రెండో పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. రెండో బాంబు పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు.

పేలుడు ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉధంపూర్-రామ్‌నగర్ మధ్య తిరుగుతున్న జేకే14సీ-3636 బస్సులో పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ పేలుడు ధాటికి బస్సు దగ్ధం కాగా, సమీపంలో పార్క్ చేసిన ఇతర బస్సులు కూడా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ పేలుడు జరిగినప్పుడు బస్సులో ఎవరూ లేరు.

ఇది కూడా చదవండి: ముగ్గురు TRS ఎమ్మెల్యేల హత్యకు మావోయిస్టుల ప్లాన్..!!