Site icon HashtagU Telugu

Raghav Chadda : అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక భారీ కుట్ర: ఆప్ ఎంపీ

Massive conspiracy behind Arvind Kejriwal's arrest: AAP MP

Massive conspiracy behind Arvind Kejriwal's arrest: AAP MP

 

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్టుపై పై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా(AAP MP Raghav Chadha) తీవ్రంగా స్పందించారు. ఈ అరెస్ట్ అక్రమం అని ఆక్రోశించారు.

We’re now on WhatsApp. Click to Join.

కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు. సరిగ్గా లోక్ సభ ఎన్నికల ముందే అరెస్ట్ చేయడం దేనికి నిదర్శనం? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ కు కోట్లాది ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, ఆయనను టచ్ చేయడం ఎవరి వల్లా కాదని రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు.

“ఆప్ ప్రభుత్వాలు కొనసాగుతున్న ఢిల్లీ, పంజాబ్ లో జరిగిన అద్భుతమైన పనుల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నారు. ఆయన శరీరాన్ని అరెస్ట్ చేయగలరేమో కానీ, ఆయన ఆలోచనలను, సిద్ధాంతాలను అరెస్ట్ చేయలేరు” అంటూ రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు.

READ ALSO: Congress List: కాంగ్రెస్‌ మరో జాబితా విడుదల.. పోటీలో ఎవరంటే..?

కాగా, ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇటీవల భారాస నేత కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు, తాజాగా దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లారు. దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం ఆయనకు పదోసారి సమన్లు ఇచ్చేందుకు వెళ్లినట్లు సమాచారం. సీఎం నివాసం వద్ద సిబ్బంది ఆరా తీయగా, సెర్చ్‌ వారెంట్‌తోనే వచ్చామని చెప్పినట్లు తెలుస్తోంది.