Site icon HashtagU Telugu

COVID-19: చలికాలంలో పెరగనున్న కోవిడ్

COVID Wave In Singapore

COVID Wave In Singapore

COVID-19: మూడేళ్ళ క్రితం కోవిడ్ లాంటి మహమ్మారి ప్రపంచాన్ని వణికించేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దీని భారీన పడ్డారు. లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. దీంతో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించాయి. మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేశాయి. దీంతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయింది. ఇలా మూడు సార్లు ప్రభుత్వాలు లాక్ డౌన్ లను విధించాయి. ప్రస్తుతం అంతా సద్దుమణుగుతుంది అనుకున్న టైంలో ఆందోళన కలిగించే ఓ వార్త వైరల్ అవుతుంది. త్వరలో మళ్ళీ లాక్ డౌన్ పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తుంది.వచ్చే శీతాకాలం వరకు కోవిడ్ కేసులు పెరగనున్నట్టు నివేదికలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో మాస్కులు, వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి అంటూ వైద్యులు సూచిస్తున్నారు. వాక్సిన్ తీసుకొని వాళ్లకు కోవిడ్ ప్రమాదముందని చెప్తున్నారు.

ఢిల్లీలోని ఇండియన్ స్పైనల్ ఇంజ్యూరీస్ సెంటర్, ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. కొత్త వేరియంట్లలో దర్శనమిస్తున్న కోవిడ్ ని జయించాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, మాస్కులు కూడా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. వాక్సిన్ చేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అలాగే రోగనిరోధక శక్తిని మెరుగుపర్చుకోవాలని అన్నారు.

అమెరికాలో వేసవిలో కోవిడ్ పరిస్థితులు పునరావృతం అయ్యాయి. ఇటీవల అక్కడ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కొన్ని ప్రదేశాల్లో కోవిడ్ రూల్స్ అమలయ్యాయి. పలు ప్రాంతాల్లో మాస్కులతో దర్శనమిస్తున్నారు.

Also Read: Hyderabad : ముద్దపప్పు, బలి దేవతకు స్వాగతం అంటూ పోస్టర్లు..