Murder: వీడిన బెంగళూరులో వివాహిత హత్య మిస్టరీ..

Murder: ప్రేమ పేరుతో ఆటలాడిన యువకుడు ఓ ఇంటి దీపాన్ని గాలి తీశాడు. బెంగళూరులో ఓ వివాహిత యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రాణం కోల్పోయిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Murder (1)

Murder (1)

Murder: ప్రేమ పేరుతో ఆటలాడిన యువకుడు ఓ ఇంటి దీపాన్ని గాలి తీశాడు. బెంగళూరులో ఓ వివాహిత యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రాణం కోల్పోయిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓయో హోటల్ గదిలో తన ప్రేమికుడి చేతుల్లోనే ఆమె మృతిచెందింది. ఈ ప్రేమ బంధం చివరకు హత్యతో ముగిసింది.

కెంగేరి ప్రాంతానికి చెందిన హరిణి (33)కు దాసేగౌడతో వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్న ఆమెకి ఇటీవల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యశస్ (25)తో పరిచయం ఏర్పడింది. వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధంగా మారింది. ఈ వ్యవహారం భర్త దాసేగౌడకి తెలిసి, ఆయన ఆమెను హెచ్చరించాడు. కొంతకాలం తప్పు గుర్తించిన హరిణి, భర్త క్షమాపణ కోరింది. భర్త ఆమెను నమ్మి మళ్లీ ఫోన్ ఇచ్చిన తర్వాత హరిణి మళ్లీ యశస్‌తో కాంటాక్ట్‌లోకి వెళ్లింది.

జూన్ 7న యశస్‌ బెంగళూరులోని పూర్ణ ప్రజ్ఞ లేఅవుట్‌లోని ఓయో హోటల్‌కి హరిణిని పిలిచాడు. అక్కడ గదిలో ఆమెతో కలిసి జీవించాలన్న యశస్‌ అభ్యర్థనను హరిణి తిరస్కరించింది. దీనితో హతాశుడైన యశస్ ఆగ్రహంతో కత్తితో ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన హరిణి అక్కడికక్కడే మృతిచెందింది. హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా సుబ్రహ్మణ్యపురం పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన వారు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Shubhanshu Shukla : శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయాణం వాయిదా

  Last Updated: 10 Jun 2025, 11:28 AM IST