Chhattisgarh Encounter : బీఆర్ దాదా మృతి పై మావోయిస్టు లేఖ

Chhattisgarh Encounter : బీఆర్ దాదా మృతి పై మావోయిస్టు లేఖ బసవరాజు మృతికి తమ భద్రతా లోపాలే కారణమని ఒప్పుకున్నారు. కొన్ని అంతర్గత విభేదాలు, వ్యూహాత్మక తప్పిదాలు, విశ్వాస ఘాతకుల చర్యల వల్లే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది

Published By: HashtagU Telugu Desk
Basava Raju Alias Br Dada

Basava Raju Alias Br Dada

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని అబూజ్‌మాడ్ అడవుల్లో ఇటీవల జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌(Abujhmad encounter)లో టాప్ మావోయిస్ట్ నేత బసవరాజు అలియాస్ బీఆర్ దాదా (Basava Raju alias BR Dada) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మావోయిస్టులు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. అందులో వారు బసవరాజు మృతికి తమ భద్రతా లోపాలే కారణమని ఒప్పుకున్నారు. కొన్ని అంతర్గత విభేదాలు, వ్యూహాత్మక తప్పిదాలు, విశ్వాస ఘాతకుల చర్యల వల్లే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది అని వారు వివరించారు. బసవరాజు సేఫ్ జోన్‌కు వెళ్లేందుకు నిరాకరించడమే ఆయన ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు.

Mahanadu 2025 : కడపలో మహానాడు ఆలోచన ఎవరిదీ..? మొత్తం నడిపించింది ఎవరు..?

ప్రకటనలో మరో కీలక విషయం ఏమిటంటే.. ఇటీవల కొంతమంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారని, వారు ఇచ్చిన సమాచారంతోనే బీఆర్ దాదా అడుగులు పోలీసులకు తెలిసిపోయాయని తెలిపారు. ముఖ్యంగా సెంట్రల్ మిలీషియా కమిటీ మరియు యూనిఫైడ్ కమాండ్‌కు చెందిన వ్యక్తులే ఈ సమాచారం ఇవ్వడం వల్ల, తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని వారు వాపోయారు. అధికారిక గణాంకాల ప్రకారం 27 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు ప్రభుత్వం తెలిపినా, అసలైన సంఖ్య 28 అని మావోయిస్టులు ప్రకటించారు.

ఎన్‌కౌంటర్ తాలూకు రోజువారీ వివరాలను కూడా మావోయిస్టులు వెల్లడించారు. మే 17న మొదలైన ఆపరేషన్, మే 21వ తేదీ ఉదయం తుది దాడితో ముగిసింది. తమవద్ద కేవలం 35 మంది మాత్రమే ఉండగా, వేలాదిమంది పోలీసుల బలగాలు, అధునాతన ఆయుధాలు, హెలికాప్టర్ల సహాయంతో తమను చుట్టుముట్టినట్టు తెలిపారు. తాము చివరి వరకు ఆకలితో పోరాడినట్టు పేర్కొంటూ, బసవరాజును చివరి వరకు రక్షించే ప్రయత్నం చేశామని చెప్పారు. చివరగా యువతపై దృష్టి పెట్టనున్నట్టు పేర్కొన్న మావోయిస్టులు, జల-జంగల్-జమీన్ కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

Letter Moi

  Last Updated: 26 May 2025, 10:00 PM IST