దేశ రవాణా వ్యవస్థను ఆధునీకరించేందుకు భారత రైల్వే (Indian Railway)కీలక అడుగు వేసింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన ప్రకారం, కొత్తగా 200 రైళ్లు (200 Trains) తయారవుతున్నాయి, వాటిలో చాలా వరకూ తెలంగాణ(Telangana)లోనే రూపొందించబడుతుండడం గర్వకారణం. ఇటీవల ట్రాకుల పునరుద్ధరణతో పాటు స్పీడ్ లిమిట్ పెంపు జరగడంతో, కొత్త స్పీడ్‌కు అనుగుణంగా ఆధునికమైన రైళ్లు అందుబాటులోకి తెస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ ట్రైన్లలో 50 నమో భారత్, 100 MEMU, 50 అమృత్ భారత్ రైళ్లు ఉండబోతున్నాయి.
Renigunta Airport : రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు శ్రీవారి పేరు పెట్టాలని ప్రతిపాదన
50 నమో భారత్ రైళ్లు పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ ప్యాసింజర్ రైళ్లు కావడం విశేషం. గుజరాత్‌లో అహ్మదాబాద్-భుజ్, బిహార్‌లో పాట్నా-జయ్‌నగర్ మార్గాల్లో ప్రయోగాత్మకంగా నడిపిన ఈ రైళ్లకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దీని ప్రేరణతో దేశవ్యాప్తంగా మరిన్ని నమో భారత్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు, 100 MEMU రైళ్లు కాజీపేట ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి. సాధారణంగా 8-12 బోగీలు ఉండే మెమూ రైళ్లకు, ఈ సారి 16-20 బోగీలతో అధిక సామర్థ్యంతో రూపొందిస్తున్నారు. దగ్గర దూరాల ప్యాసింజర్ రైళ్ల కొరత తీరనుంది.
Nara Lokesh : ఢిల్లీకి నారా లోకేష్ ..పూర్తి షెడ్యూల్ ఇదే
దూర ప్రాంతాలకు ప్రయాణించే సామాన్య ప్రయాణికుల కోసం అమృత్ భారత్ ట్రైన్లు రూపొందించబడ్డాయి. ప్రస్తుతం మూడు రైళ్లు నడుస్తుండగా, మరిన్ని ఆరు సిద్ధమయ్యాయి. తాజా ప్రకటన ప్రకారం ఇంకా 50 నాన్-ఏసీ అమృత్ భారత్ రైళ్లు దేశానికి అందించనున్నారు. వీటిలో జనరల్, స్లీపర్ క్లాసులే ఉండబోతున్నాయి. మధ్యతరగతి, సామాన్యులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపిందని, ఎన్నాళ్లకైనా సరే ప్రజల అవసరాలపై రైల్వే శ్రద్ధ చూపుతోందని విశ్లేషకుల అభిప్రాయం.