Manish Sisodia: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody)ని ఢిల్లీ హైకోర్టు ఈనెల 31 వరకు పొడిగించింది. మద్యం కుంభకోణం కేసు(Liquor scam case)లో సిసోడియా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ, సీబీఐ దాఖలు చేసిన మనీలాండరింగ్, అవినీతి కేసుల్లో ఆప్‌నేత జ్యుడీషియల్ కస్డడీని మే 31 వరకు పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పును వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, మనీశ్ సిసోడియా, సీబీఐ, ఈడీ తరఫున వాదనలు విన్న హైకోర్టు మే 14న పిటిషన్లపై తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. రెండు బెయిల్ పిటిషన్లపైనా న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈడీ, సీబీఐ మనీశ్ సిసోడియాను బెయిల్ పై విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కాగా, సిసోడియా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 2023 ఫిబ్రవరి నుంచి జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.