Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్‌ సిసోడియాకు షాక్.. జ్యుడిషీయల్ రిమాండ్ పొడిగింపు..!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Policy Case)లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా (Manish Sisodia)కు ఊరట లభించడం లేదు.

  • Written By:
  • Publish Date - April 18, 2023 / 06:52 AM IST

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Policy Case)లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా (Manish Sisodia)కు ఊరట లభించడం లేదు. ఎక్సైజ్ కేసులో మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు 14 రోజుల పాటు పొడిగించింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన సీబీఐ, ఈడీ కేసుల్లో మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మే 1 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో, ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను కోర్టు నేడు విచారించనుంది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు. సీబీఐ కేసులో మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 27 వరకు, ఈడీ కేసులో ఏప్రిల్ 29 వరకు రోస్ అవెన్యూ కోర్టు సోమవారం (ఏప్రిల్ 17) పొడిగించింది. ఈ నెలాఖరులోగా ఛార్జిషీటు (ప్రాసిక్యూషన్ ఫిర్యాదు) దాఖలు చేయబోతున్నట్లు ఈడీ తరపు న్యాయవాది చేసిన సమర్పణలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఎక్సైజ్ కుంభకోణం కేసులో మనీష్ సిసోడియాతో పాటు నిందితులు అరుణ్ రామచంద్ర పిళ్లై, అమన్‌దీప్ ధాల్‌లకు కూడా జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు. ఈడీ నమోదు చేసిన కేసులో అరుణ్ పిళ్లై, అమన్‌దీప్ ధాల్‌ల జ్యుడీషియల్ కస్టడీని రోస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 29 వరకు పొడిగించింది.

Also Read: Union Minister Jyotiraditya Scinda: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా.. స్వయంగా ట్విట్టర్ వేదిక వెల్లడి

ఈ విషయంలో దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించిన తర్వాత ఫిబ్రవరి 26న ఆప్ నేత మనీష్ సిసోడియాను అరెస్టు చేశారు అతని సమాధానాలు సంతృప్తికరంగా లేవని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా, ఆయన స్థానంలో అతిషీని విద్యాశాఖ మంత్రిగా నియమించారు. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ గత ఆదివారం సుమారు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది.

సీబీఐ విచారణకు హాజరు అయినా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ తనను 56 ప్రశ్నలు అడిగిందని, వాటన్నింటికీ తాను సమాధానమిచ్చానని చెప్పారు. ఎక్సైజ్ పాలసీ వ్యవహారం అంతా ఫేక్ అని నేను చెప్పాలనుకుంటున్నాను అని కేజ్రీవాల్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తప్పు అనడానికి వారి వద్ద ఎలాంటి రుజువు లేదు. ఇది నీచ రాజకీయాల ఫలితం. వారు (సిబిఐ) నన్ను స్నేహపూర్వకంగానే ప్రశ్నలు అడిగారు. వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పానని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.