Site icon HashtagU Telugu

Sisodia : జైలు నుండి విడుదలైన మనీష్‌ సిసోడియా

Manish Sisodia Released Fro

Manish Sisodia: తీహార్ జైలు నుంచి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విడుదలయ్యారు. లిక్కర్ పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరిలో సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. పలుమార్లు ఆయన బెయిల్ పిటిషన్లు వేసినా తిరస్కరణకు గురయ్యారు. శుక్రవారం మాత్రం సుప్రీంకోర్టు సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల సందర్భంగా భారీ సంఖ్యలో ఆప్ కార్యకర్తలు, నేతలు జైలు దగ్గర ఘన స్వాగతం పలికారు.

We’re now on WhatsApp. Click to Join.

శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సిసోడియా తన పాస్‌పోర్టును సమర్పించాలని తెలిపింది. అలాగే వారానికి రెండుసార్లు సోమవారం, గురువారాల్లో పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని చెప్పింది. సిసోడియా గత 18 నెలలుగా జైలులో ఉన్నారు.

కాగా, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఫిబ్రవరి 26, 2023న రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో అవకతవకలకు పాల్పడినందుకు అరెస్టు చేసింది. మార్చి 9, 2023న సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో వచ్చిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఆయనను అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28, 2023న ఆయన ఢిల్లీ క్యాబినెట్‌కు రాజీనామా చేశారు. సిసోడియా 17 నెలలుగా కస్టడీలో ఉన్నారని వాదిస్తూ బెయిల్‌ను కోరారు.

Read Also: 7500mAh Battery: త్వ‌ర‌లో 7500 ఎంఏహెచ్ బ్యాట‌రీతో స్మార్ట్‌ఫోన్‌..?